పరీక్ష లేదు, APIIC, మంగళగిరి లో ఉద్యోగాలు, ఆకర్షణీయమైన జీతములు, వెంటనే అప్లై చేసుకోండి.
గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (APIIC),మంగళగిరి లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ముఖ్యంశాలు :
1). ఇవి ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న సంస్థకు చెందిన పోస్టులు.
2). దరఖాస్తు ఫీజులు చెల్లించవలసిన అవసరం లేదు.
3). కాంట్రాక్టు బేసిస్ లో ఈ పోస్టుల భర్తీ జరుగనుంది.
ఎటువంటి పరీక్షల నిర్వహణ లేకుండా కేవలం ఇంటర్వ్యూ విధానంలో భర్తీ చేసే ఈ పోస్టులకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఏపీఐఐసీ, హెడ్ ఆఫీస్ మంగళగిరి లో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
మంగళగిరి నుండి వచ్చిన ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన విధి - విధానాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యంశాలు :
ఆన్లైన్ ఈ - మెయిల్ దరఖాస్తులకు చివరి తేది : జనవరి 10, 2022.
విభాగాల వారీగా ఖాళీలు :
చార్టర్డ్ అకౌంటెంట్ - 1
లీగల్ అడ్వైజర్ - 1
అసిస్టెంట్ మేనేజర్ - అకౌంటెంట్ - 2
కంపెనీ సెక్రటరీ - 1
మొత్తం పోస్టులు :
5 ఉద్యోగాలను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ఐసీఏఐ నుండి చార్టెర్డ్ అకౌంటెంట్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు చార్టర్డ్ అకౌంటెంట్ (CA) పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
బాచిలర్ లా కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు లీగల్ అడ్వైజర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
బీ. కామ్ కోర్సులను కంప్లీట్ చేసిన వారు అసిస్టెంట్ మేనేజర్ - అకౌంటెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఐసీఎస్ఐ నుండి కంపెనీ సెక్రటరీ కోర్సులను కంప్లీట్ చేసిన అభ్యర్థులు కంపెనీ సెక్రటరీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు పై అర్హతలుతో పాటు ఆయా పోస్టులకు సంబంధిత విభాగాలలో అనుభవం కూడా ఉండాలని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
ఎటువంటి వయసు పరిమితి లను ఈ ప్రకటనలో పొందుపరచలేదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు ఈ క్రింది మెయిల్ అడ్రెస్ కు తమ తమ అప్లికేషన్స్ మరియు రెస్యూమ్ లను నిర్ణిత గడువు చివరి తేది లోగా పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
ఇంటర్వ్యూ విధానాల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
కేటగిరీ ల వారీగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతంలు లభించనున్నాయి.
Email Address
jyothi.basuveerla@gov.in
రైల్వే గ్రూఫ్-డి పరీక్ష వాయిదా పడుతుందా ? Click Here
0 Comments