ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవిన్యూ శాఖలో ఖాళీగా ఉన్న 670 రెవిన్యూ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్స్ మరియు ఏపీ దేవాదాయ ధర్మదాయ శాఖలో ఖాళీగా ఉన్న 60 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ( గ్రేడ్ -3) పోస్టుల భర్తీకి గానూ గత నెల డిసెంబర్ 28, 2021 నాడు ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) వరుసగా రెండు నోటిఫికేషన్స్ నూ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే.
ఏదైనా విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుండి జనరల్ డిగ్రీ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ 739 పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చునని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
ఈ పోస్టులకు అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల అనగా 2022, జనవరి 19 చివరి తేది అని ఏపీపీఎస్సీ ఈ నోటిఫికేషన్ లో పొందుపరిచినది.
ఏపీ రాష్ట్రంలో రెవిన్యూ మరియు ఎండోమెంట్ డిపార్టుమెంటు లలో ఖాళీగా ఉన్న 730పోస్టులకు అప్లై దరఖాస్తు గడువు తేది కేవలం ఇంకా రెండే రోజులు మిగిలి ఉన్నది.
ఈ నేపథ్యంలో ఇంకా ఎవరైనా సరే అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అని అనుకుంటే ఈ క్రింది లింక్ ద్వారా ఆయా విభాగాల పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు దరఖాస్తు గడువు తేది పెంపుపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కనుక ఈ అప్లికేషన్స్ ప్రక్రియ ఎల్లుండు అనగా జనవరి 19, 2022 నాడు ముగియనుంది. కావున అర్హతలు గల అభ్యర్థులు ఈ పోస్టులకు ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం అని మనం చెప్పుకోవచ్చు.
ఏ ఉద్యోగ సమాచరంకి అయిన సరే తెలుసుకొవడానికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి. Click Here
సరికొత్తగా APPSC లో కంప్యూటర్ అసిస్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీ జీతం 49,000 వరకు పర్మెనెంట్ ఉద్యోగాలు Click Here
0 Comments