జీతం 69,100 రూపాయలు వరకూ, 10వ తరగతి అర్హతతో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) లో 2788 ఉద్యోగాలు, అస్సలు మిస్ కావద్దు, ఇప్పుడే అప్లై చేసుకోండి.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, డైరెక్టరేట్ జనరల్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి 2021-22 సంవత్సరాలకు గానూ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న సుమారు 2788 కానిస్టేబుల్ (ట్రేడ్ మెన్ ) ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు:
1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.
2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే.
3). పేర్మినెంట్ గా ఉద్యోగాలు చేసుకునే అవకాశం కలదు.
4). భారీ స్థాయిలో జీతములు.
ఈ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ జరుగనుంది. మొదట టెంపరరీ గా భర్తీ చేసే ఈ ఉద్యోగాలను తరువాత పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ప్రతిభా, పని తీరులను బట్టి ఈ ఉద్యోగాలను పేర్మినెంట్ గా చేసుకునే అవకాశంను కల్పించనున్నారు.
బీ.ఎస్. ఎఫ్ నుండి వచ్చిన ఈ ప్రకటనలో తెలిపిన అతి ముఖ్యమైన అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : ప్రకటన వచ్చిన 45 రోజుల లోపు..
విభాగాల వారీగా ఖాళీలు :
మేల్స్ :
పోస్ట్ లు | ఖాళీలు |
---|---|
కోబ్లర్ | 88 |
టైలర్ | 47 |
కుక్ | 897 |
W/C | 510 |
W/M | 338 |
బార్బర్ | 123 |
స్వీపర్ | 617 |
కార్పెంటర్ | 13 |
పెయింటర్ | 3 |
ఎలక్ట్రీషియన్ | 4 |
డ్రాట్స్ మెన్ | 1 |
వెయిటర్ | 6 |
మాలి | 4 |
ఫిమేల్స్ :
పోస్ట్ లు | ఖాళీలు |
---|---|
కోబ్లర్ | 3 |
టైలర్ | 2 |
కుక్ | 47 |
W/C | 27 |
W/M | 18 |
బార్బర్ | 7 |
స్వీపర్ | 33 |
మొత్తం పోస్టులు :
2788 పోస్టులను తాజాగా విడుదల అయిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ /బోర్డు ల నుండి మేట్రిక్యూలేషన్స్ ను పూర్తి చేసి, సంబంధిత ట్రేడ్ విభాగాలలో రెండు సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్ లేదా ఒక సంవత్సరం ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుండి సర్టిఫికెట్ కోర్సు లేదా రెండు సంవత్సరాల డిప్లొమా కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
విభాగాలను అనుసరించి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండవలెను అని ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
18 నుండి 23 సంవత్సరాలు వరకూ వయసు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఆయా కేటగిరిల అభ్యర్థులకు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను ఈ ప్రకటనలో పొందుపరచలేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
విభాగాలను అనుసరించి వ్రాత పరీక్షలు / స్కిల్ టెస్టుల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
కేటగిరీలను అనుసరించి ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 21,700 రూపాయలు నుండి 69, 100 రూపాయలు వరకూ జీతం అందనుంది.
ఈ జీతంతో పాటుగా ఇతర అలోవెన్స్ లు కూడా లభించనున్నాయి.
ఏ ఉద్యోగ సమాచరంకి అయిన సరే తెలుసుకొవడానికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి. Click Here
0 Comments