Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Railway NTPC : రైల్వే పరీక్షలు వ్రాసిన అభ్యర్థులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన మినిస్ట్రీ ఆఫ్ రైల్వే

ఫ్లాష్ న్యూస్, అభ్యర్థులు జరజాగ్రత్త..!  రైల్వే పరీక్షలు వ్రాసిన అభ్యర్థులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన మినిస్ట్రీ ఆఫ్ రైల్వే 

గడిచిన రోజున బీహార్ రాష్ట్ర రాజధాని నగరం పాట్న రైల్వే స్టేషన్ లో రైల్వే పోస్టుల భర్తీ విధి విధానాలను వ్యతిరేకిస్తూ కొంతమంది రైల్వే పరీక్షలు వ్రాసిన అభ్యర్థులు రైల్వే స్టేషన్ పట్టాలపై పడుకుని, రైలు ప్రయాణాలకు ఆటంకం కల్పిస్తూ ధర్నా చేసిన సంగతి మనకు తెలిసిందే.

Railway NTPC

నిన్న జరిగిన ఈ పాట్న ఘటనపై మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ తమ స్పందనను తెలియజేసింది. నిన్న జరిగిన ఘటనలో పాల్గొన్న రైల్వే పరీక్షలు వ్రాసిన అభ్యర్థులకు తమ సీరియస్ వార్నింగ్ ను ఇస్తూ ఒక అతి ముఖ్యమైన ప్రకటనను మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు జారీ చేసింది.

రైల్వే పోస్టుల భర్తీ చాలా పారదర్శకంగా జరుగుతుందని, అభ్యర్థులు ఎవరూ ఆందోళన చెందవద్దని,ఇకపై ఎవరైనా అభ్యర్థులు రైల్వే పోస్టుల భర్తీ వ్యవహారంలో నిన్న జరిగిన పాట్న ఘటన లాంటి వ్యవహారలలో పాల్గొన్న యెడల ఆ అభ్యర్థులందరిని స్పెషల్ టీమ్స్ ద్వారా గుర్తించి, Railway NTPC

జీవితంలో రైల్వే పరీక్షలు వ్రాసే అవకాశంలను నిలుపుదల చేస్తామని, జీవితకాలం రైల్వే పరీక్షలు వ్రాయకుండా డిబార్ చేస్తామని, ఈ ప్రకటన ద్వారా రైల్వే పరీక్షలు వ్రాసిన, వ్రాయబోతున్న అభ్యర్థులకు ఘాటైనా హెచ్చరికలను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. 

ఇప్పుడు వచ్చిన వార్త:

మీకు ఏ విధమైన సమస్యలు ఉన్న rrbcommittee@railnet.gov.in కి మెయిల్ చెయ్యండి. ఫిబ్రవరి 16 వరకు రైల్వే అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ ఫిర్యాదుల్ని పరిశీలించిన తరువాత మార్చి 4 లోగా తమ సిఫార్సుల్ని సమర్పిస్తుంది. 

Post a Comment

0 Comments