Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Tirupati Jobs Telugu 2022 : తిరుపతిలో ఉచిత శిక్షణ మరియు స్వయం ఉపాధి అవకాశాలు, అద్భుతమైన అవకాశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో ఎయిర్ కండిషన్ రిపేర్స్, స్పిల్ట్ మరియు విండో ఎయిర్ కండిషనర్, ఇన్స్టాలేషన్ బేసిక్,హెచ్విఏసీ ఎయిర్ కండిషషింగ్ సర్వీస్ యంత్రాల నిర్వహణ, ఇన్వెర్టర్ ఏసీ, స్పిల్ట్ ఎయిర్ కండిషనర్, ట్రేడ్ స్కిల్స్ నందు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లుగా ఒక అతి ముఖ్యమైన ప్రకటన విడుదల అయినది. 

Tirupati Jobs Telugu 2022

ఈ ఉచిత శిక్షణ మరియు స్వయం ఉపాధి లో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా రిజిస్ట్రేషన్స్ ను చేసుకోవచ్చు.

ఏపీఎస్ఎస్డిసీ నుండి వచ్చిన ఈ ప్రకటనలో ముఖ్యంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. Tirupati Jobs Telugu 2022

ముఖ్యంశాలు  :

1). ఈ ఉచిత శిక్షణను ప్రముఖ వాణిజ్య సంస్థలు జాన్సన్ కంట్రోల్స్ మరియు హిటచి ఎయిర్ కండిషనింగ్ ఇండియా లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా కలిసి అభ్యర్థులకు కల్పిస్తున్నాయి.

2). మూడు నెలల పాటు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకూ ఈ శిక్షణ ఉండబోతుంది.

3). మూడు నెలల ఉచిత శిక్షణ అనంతరం సర్టిఫికెట్ ఇచ్చి, ఏసీ డీలర్స్ వద్ద ఉద్యోగం పొందే అవకాశాలను కూడా కల్పిస్తున్నారు.

4). స్వయం ఉపాధి పొందాలనుకునే వారికీ ఇది అత్యంత ఉత్తమమైన అవకాశంగా మనం చెప్పుకోవచ్చు.

ఉచిత శిక్షణ  - ఉండవల్సిన విద్యా అర్హతలు :

10వ తరగతి (లేదా) ఇంటర్ (లేదా) డిప్లొమా లలో పాస్ అయిన అభ్యర్థులు మరియు డిగ్రీ (పాస్ - ఫెయిల్ ) అయిన అభ్యర్థులు అందరూ ఈ ఉచిత శిక్షణలో పాల్గొనవచ్చు.

ఉచిత శిక్షణ కాల వ్యవధి  - నిర్వహణ సమయం  :

మూడు నెలలు శిక్షణ కాలవ్యవధి గా ఉంటుంది.

సమయం  : 9 : 30 AM to 5 PM.

ఉచిత శిక్షణ ఇచ్చే ప్రదేశాలు :

1). గవర్నమెంట్ ఐటీఐ,   తిరుపతి.

2). గవర్నమెంట్ ఐటీఐ ( బాలురు ), అనంతపురం.

3). గవర్నమెంట్ ఐటీఐ, విజయవాడ.

4). గవర్నమెంట్ ఐటీఐ, కాకినాడ.

5). గవర్నమెంట్ ఐటీఐ, బొబ్బిలి, విజయనగరం.

సంప్రదించవల్సిన ఫోన్ నంబర్లు :

99888 53335

Registration Link

More Jobs in telugu Today Click Here

Tirupati Devasthanam Jobs 2022 Telugu

Post a Comment

0 Comments