గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ ఆధ్వర్యంలో ఉన్న మహరత్న కంపెనీ కు చెందిన హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL),విశాఖపట్టణం లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న అప్ప్రెంటీస్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
అయితే ఈ అద్బుతమైన అవకాశం గురించి తన యొక్క ట్విట్ లో ఖాతలో సంస్థ ట్వీట్ చెయ్యడం జరిగింది. అభ్యర్థులు స్ల్రోల్ చేసి ట్వీట్ ని చూడవచ్చును.
ముఖ్యంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన అప్ప్రెంటీస్ పోస్టులు.
2).ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు.
3).భారీ స్థాయిలో స్టై ఫండ్స్.
4). ఈ అప్ప్రెంటీస్ షిప్ సర్టిఫికెట్స్ భవిష్యత్తులో జరిగే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నియామకలలో ఉపయోగకరంగా ఉంటుంది.
వైజాగ్, హెచ్పిసీఎల్ లో భర్తీ కానున్న ఈ అప్ప్రెంటీస్ షిప్ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు. Vizag HPCL Recruitment 2022
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వైజాగ్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు..
HPCL విశాఖపట్నం నుండి వచ్చిన ఈ అప్ప్రెంటీస్ షిప్ ల భర్తీ విధి - విధానాలను గురించి మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : జనవరి 7, 2022
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : జనవరి 14, 2022
ఇంటర్వ్యూ నిర్వహణ తేది : జనవరి,2022
విభాగాల వారీగా ఖాళీలు :
గ్రాడ్యుయేట్ అప్ప్రెంటీస్ ట్రైనీస్ (ఇంజనీరింగ్ ) - 100
బ్రాంచ్ ల వారీగా అప్ప్రెంటీస్ లు :
మెకానికల్ ఇంజనీరింగ్
ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
కెమికల్ ఇంజనీరింగ్
సివిల్ ఇంజనీరింగ్
ఇన్స్ట్రుమెంటేషన్
మెటీరియల్స్ మేనేజ్ మెంట్
సేఫ్టీ ఇంజనీరింగ్
కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ /ఐటీ
ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
ఆర్చిటేక్చర్
కేటరింగ్ టెక్నాలజీ
సివిల్ ఎన్విరాన్ మెంటల్
కమ్యూనికేషన్ & కంప్యూటర్ ఇంజనీరింగ్
కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్ )
కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ (డేటా సైన్స్ )
ఎనర్జీ ఇంజనీరింగ్
ఎన్విరాన్ మెంట్ పొల్యూషన్ & కంట్రోల్ ఇంజనీరింగ్
ఫైన్ ఆర్ట్ /స్కలప్చర్ /కమర్షియల్ etc
ఫుడ్ ప్రాసెసింగ్ ఇంజనీరింగ్
ఫుడ్ టెక్నాలజీ
హోటల్ మేనేజ్ మెంట్ & కేటరింగ్ టెక్నాలజీ
ఇండస్ట్రీయల్ ఇంజనీరింగ్
ఇంటిరియర్ డెకొరేషన్
పెట్రోలియం ఇంజనీరింగ్
రిజనల్ & టౌన్ ప్లానింగ్
టెలి కమ్యూనికేషన్ & ఇంజనీరింగ్
టెలివిజన్ ఇంజనీరింగ్
వాటర్ మేనేజ్ మెంట్
HPCL Visakh Refinery proposes to engage 100 Graduate Apprentice Trainees from 28 engineering streams for a period of 1 year with Rs. 25,000 stipend. Application available on https://t.co/JBaBQIxMTp Tap the link to register & apply. @HPCL @sdivisakh @PetroleumMin pic.twitter.com/tj0G2zKPPL
— HPCL Visakh Refinery (@HPCL_VR) January 7, 2022
మొత్తం ఖాళీలు :
100 కు పైగా అప్ప్రెంటీస్ షిప్ పోస్టుల భర్తీని తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
సంబంధిత సబ్జెక్టు విభాగాలలో గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుండి 60% మార్కులతో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ అప్ప్రెంటీస్ షిప్ లకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
18 నుండి 25 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ లకు చెందిన అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ లకు చెందిన అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు దివ్యాంగుల కేటగిరిలకు చెందిన అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను అభ్యర్థులు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
విద్యా అర్హతల మార్కుల మెరిట్ మరియు ఇంటర్వ్యూ ల ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు.
స్టై ఫండ్స్ :
విభాగాలను అనుసరించి ఈ అప్ప్రెంటీస్ షిప్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 25,000 రూపాయలు స్టై ఫండ్స్ లభించనున్నాయి.
0 Comments