భారతదేశ వ్యాప్తంగా ఉన్న సుమారు 136 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ లో ఖాళీగా ఉన్న సుమారుగా 8700 కు పైగా ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ ను ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సంస్థ తాజాగా విడుదల చేసినది.
ముఖ్యంశాలు :
1). ఇవి రెగ్యులర్ లేదా ఫిక్స్డ్ టర్మ్ బేసిస్ ఉద్యోగాలు.
2). ఇరు తెలుగు రాష్ట్రాలలో అర్హతలు ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు.
3). భారీ స్థాయిలో వేతనాలు.
ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ నుంచి వచ్చిన ఈ సెంట్రల్ గవర్నమెంట్ టీచర్ పోస్టులకు ఆసక్తి కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ లో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
తాజాగా వచ్చిన ఈ టీచర్ పోస్టుల భర్తీ విధి - విధానాలను మనం సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : జనవరి 7, 2022
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : జనవరి 28, 2022
ఆన్లైన్ అడ్మిట్ కార్డ్స్ విడుదల తేది : ఫిబ్రవరి 10, 2022
ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహణ తేది : ఫిబ్రవరి 19-20,2022
పరీక్ష ఫలితాల విడుదల తేది : ఫిబ్రవరి 28, 2022
విభాగాల వారీగా ఉద్యోగాలు :
పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ ( PGT)
ట్రైన్డ్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ (TGT)
ప్రైమరీ టీచర్స్ ( PRT)
సబ్జెక్టు లు వారీగా ఉద్యోగాలు :
ఇంగ్లీష్
హిందీ
సంస్కృతం
హిస్టరీ
జాగ్రఫీ
ఎకనామిక్స్
పొలిటికల్ సైన్స్
మాథ్స్ మేటిక్స్
ఫిజిక్స్
కెమిస్ట్రీ
బయాలజీ
బయో టెక్నాలజీ
సైకాలజీ
కామర్స్
కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫోర్మ్ మేటిక్స్
హోమ్ సైన్స్
ఫీజికల్ ఎడ్యుకేషన్
మొత్తం పోస్టులు :
మొత్తం 8700 కు పైగా పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డు ల నుండి సంబంధిత సబ్జెక్టు విభాగాలలో 50 % మార్కులతో బాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్ (బీఈడీ) కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ (పీజీటీ) మరియు ట్రైన్డ్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ (టీజీటీ) పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
రెండు సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా బీఈడీ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ప్రైమరీ టీచర్స్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
మరియు 50% మార్కులతో సంబంధిత సబ్జెక్టు విభాగాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను పూర్తి చేసిన వారు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రకటనలో తెలిపారు.
ఫ్రెష్ మరియు ఎక్స్పీరియన్స్ కాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని ప్రకటన ద్వారా తెలుస్తుంది.
వయసు :
57 సంవత్సరాలు వయసు లోపు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు ఈ క్రింది రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
385 రూపాయలు దరఖాస్తు ఫీజుగా అభ్యర్థులు చెల్లించవలెను.
ఎలా ఎంపిక చేస్తారు:
స్క్రీనింగ్ పరీక్ష / ఇంటర్వ్యూ /టీచింగ్ స్కిల్స్ ఎవల్యూషన్ మరియు కంప్యూటర్ ప్రోఫీషియన్సీ టెస్ట్ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ఆకర్షణీయమైన జీతం లభించనుంది.
0 Comments