ప్రముఖ వాణిజ్య సంస్థ టెక్ మహీంద్రా లో ఖాళీగా ఉన్న కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూ లను నిర్వహిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) తాజాగా ఒక అతి ముఖ్యమైన ప్రకటన ద్వారా తెలిపింది.
ముఖ్యాంశాలు:
1). ఇవి పేర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రాజెక్ట్ జాబ్స్.
2). ఇంటర్ అర్హతలు ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు.
3). భారీ సంఖ్యలో పోస్టుల భర్తీ.
4). భారీ స్థాయిలో జీతములు.
5). ఎటువంటి పరీక్షలు లేవు.
ఇంటి దగ్గరే ఉంటూ చేసుకునే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
ఏపీఎస్ఎస్డీసీ నుండి తాజాగా వెలువడిన ఈ ప్రకటన గురించి మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కు చివరి తేది : ఫిబ్రవరి 2, 2022.
విభాగాల వారీగా ఖాళీలు :
కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ - 700
భాషల వారీగా కేటాయించిన పోస్టులు :
తెలుగు - 150
హిందీ - 150
ఇంగ్లీష్ - 150
తమిళ్ - 150
కన్నడ - 150
మొత్తం పోస్టులు :
సుమారుగా 700 పైగా పోస్టులను తాజాగా వచ్చిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ఇంటర్మీడియట్ /డిప్లొమా /గ్రాడ్యుయేషన్ /పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ ) కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
తెలుగు / హిందీ /ఇంగ్లీష్ /తమిళ్ /కన్నడ భాషలు తెలిసి ఉండాలని ఈ ప్రకటనలో తెలిపారు.
అభ్యర్థులకు లాప్టాప్ / డెస్క్ టాప్ విండోస్ -10, గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ తో ఉండి, మంచి పవర్ బ్యాక్ అప్ ఉండాలి అని ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
18 నుండి 35 సంవత్సరాలు వయసు కలిగిన పురుషులు మరియు స్త్రీ అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా రిజిస్ట్రేషన్స్ ను చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
టెలి ఫోనిక్ రౌండ్ / పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి 2 లక్షల రూపాయలు నుండి 3 లక్షల రూపాయలు వరకూ జీతం అందనుంది.
సంప్రదించవల్సిన ఫోన్ నంబర్లు :
7609999606
9502825143
9988853335
Tech Mahindra లో జాబ్స్ @apssdc pic.twitter.com/ZLIsL6H4yz
— SHIVA REDDY ADVOCATE (@shivare46619067) January 28, 2022
0 Comments