జీతం 78,800 రూపాయలు వరకూ, టాటా మెమోరియల్ సెంటర్ లో క్లర్క్ ఉద్యోగాలు, ఫుల్ టైమ్ బేసిస్ లో భర్తీ, వెంటనే అప్లై చేసుకోండి, అస్సలు మిస్ కావద్దు.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్టుమెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీ ఆధ్వర్యంలో ఉన్న టాటా మెమొరీయల్ సెంటర్, ముంబై లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
1).ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.
2).ఇరు తెలుగు రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
3).వీటిని ఫుల్ టైమ్ బేసిస్ లో భర్తీ చేయనున్నారు.
4).భారీ స్థాయిలో వేతనాలు.
ఈ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు. TATA Memorial Jobs Telugu 2022
టాటా మెమోరియల్ సెంటర్ లో భర్తీ చేయనున్న ఈ పోస్టులకు సంబంధించిన వివరాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : మార్చి 8, 2022(5:30 PM)
విభాగాల వారీగా ఖాళీలు :
| పోస్ట్ లు | ఖాళీలు |
|---|---|
| సైంటిఫిక్ ఆఫీసర్ (ఈ) క్లినికల్ న్యూరోఫిజియోలిస్ట్ | 1 |
| సైంటిఫిక్ ఆఫీసర్(డీ) బయో ఇన్ఫర్మటిక్స్ | 1 |
| సైంటిఫిక్ ఆఫీసర్(డీ) నూక్లియర్ మెడిసిన్ | 2 |
| సైంటిఫిక్ ఆఫీసర్(డీ)కాన్సర్ ఎపిమియోలజీ | 1 |
| అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్స్ | 2 |
| అసిస్టెంట్ పర్చేస్ ఆఫీసర్స్ | 3 |
| నర్స్ ఏ ఫిమేల్ | 44 |
| నర్స్ ఏ | 5 |
| సైంటిఫిక్ అసిస్టెంట్ బీ (బయో మెడికల్ ) | 2 |
| సైంటిఫిక్ అసిస్టెంట్ బీ (నూక్లియర్ మెడిసిన్ ) | 6 |
| అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ | 6 |
| లోయర్ డివిజన్ క్లర్క్ | 13 |
మొత్తం పోస్టులు :
86 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి సంబంధిత సబ్జెక్టు విభాగాలలో గ్రాడ్యుయేషన్ /పోస్ట్ గ్రాడ్యుయేషన్ / బీ.ఈ/బీ.టెక్ /డిప్లొమా/ICWAI/సీఏ/ఎంబీఏ/పీ. హెచ్. డీ మొదలైన కోర్సులను పూర్తి చేసి, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండి, మరియు సంబంధిత విభాగాలలో అనుభవం కలిగి ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
విభాగాల వారీగా 45 సంవత్సరాలు వయసు లోపు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యంగులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ / ఓబీసీ కేటగిరీ లకు చెందిన అభ్యర్థులు 300 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
మిగిలిన కేటగిరీ అభ్యర్థులు ఎటువంటి ఫీజులు చెల్లించవల్సిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు :
ఇంటర్వ్యూ /వ్రాత పరీక్ష /స్కిల్ టెస్ట్ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
కేటగిరీ లను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 19,900 రూపాయలు నుండి 78,800 రూపాయలు వరకూ జీతం అందనుంది.
ఈ జీతంతో పాటుగా ఇతర అలోవెన్స్ లు కూడా లభించనున్నాయి.
0 Comments