ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సుమారు 560 ఎక్స్ టెన్షన్ ఆఫీసర్స్ గ్రేడ్ - 2 (సూపర్ వైజర్స్ ) పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటనను తాజాగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జారీ చేసినది. AP Anganwadi Jobs 2022
ఈ అప్డేట్ లో పొందుపరిచిన ముఖ్యమైన అంశాలను మనం ఒకసారి పరిశీలిద్దాం.
గ్రేడ్ - II సూపర్ వైజర్స్ ఖాళీలు :
విశాఖపట్నం - 76
ఏలూరు - 126
ఒంగోలు - 142
కర్నూల్ - 216
మొత్తం ఖాళీలు :
560 ఖాళీలను భర్తీ చేయనున్నట్లుగా ఈ ప్రకటన ద్వారా తెలిపారు.
భర్తీ విధానం..ఎలా..?
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐసీడీఎస్ లలో ఖాళీగా ఉన్న ఈ 560 గ్రేడ్ - 2, సూపర్ వైజర్స్ పోస్టులను అంగన్వాడీ కార్యకర్తలతో భర్తీ చేయనున్నట్లు ఈ ప్రకటనలో పొందుపరిచారు.
ఏపీ ప్రభుత్వం ఏర్పాటుచేసే నియామక కమిటీ ద్వారా ఈ పోస్టుల భర్తీ జరుగనుంది.
0 Comments