తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ జిల్లాలలో ఉన్న ది డిస్ట్రిక్ట్ కో - ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్స్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న సుమారుగా 445 పోస్టుల భర్తీకి సంబంధించిన ముఖ్యమైన ప్రకటనలు తాజాగా జిల్లాల వారీగా విడుదల అయినవి.
ముఖ్యాంశాలు :
1).భారీ సంఖ్యలో పోస్టుల భర్తీ.
2). సొంత జిల్లాలోనే ఉద్యోగాలు చేసుకునే అవకాశం.
3). భారీ స్థాయిలో వేతనాలు.
ఈ పోస్టులకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన లోకల్ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవలెను అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
పోస్టుల భర్తీ విధి - విధానాలను గురించి మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : ఫిబ్రవరి 19, 2022
దరఖాస్తులకు చివరి తేది : మార్చి 6, 2022
ప్రిలిమ్స్ పరీక్షల నిర్వహణ తేది : ఏప్రిల్ 23, 2022
విభాగాల వారీగా ఖాళీలు :
స్టాఫ్ అసిస్టెంట్ - 372
అసిస్టెంట్ మేనేజర్ - 73
జిల్లాల వారీగా ఖాళీలు :
ఆదిలాబాద్ - 69
హైదరాబాద్ - 52
కరీంనగర్ - 84
మహబూబ్ నగర్ - 32
మెదక్ - 72
నల్గొండ - 36
వరంగల్ - 50
ఖమ్మం - 50
మొత్తం పోస్టులు :
445 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటనల ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి 60% మార్కులతో గ్రాడ్యుయేషన్ లేదా 55% మార్కులతో కామర్స్ గ్రాడ్యుయేట్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు తెలుగు భాష లో మంచి ప్రావిణ్యత కలిగి ఉండి, ఇంగ్లీష్ భాష నాలెడ్జి ఉండవలెను అని ఈ ప్రకటనలో పొందుపరిచారు. DCCB Co Operative Bank Jobs 2022
వయసు :
18 - 32 సంవత్సరాలు వయసు గల అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు బీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు దివ్యంగులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి :
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలేను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ /బీసీ కేటగిరీ అభ్యర్థులు 900 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ /పీసీ కేటగిరీ లకు చెందిన అభ్యర్థులు 250 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎలా ఎంపిక చేస్తారు..?
ఆన్లైన్ విధానంలో ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
పరీక్షల సిలబస్ - వివరాలు :
ప్రిలిమ్స్ పరీక్షలు :
1).ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహణ
2).100 ప్రశ్నలకు 100 మార్కులను కేటాయించారు.
3).60 నిమిషాల సమయం పరీక్ష కాల వ్యవధి గా ఇచ్చారు.
సిలబస్ :
ఇంగ్లీష్ - 30 మార్కులు.
రీజనింగ్ ఎబిలిటీ - 35 మార్కులు.
క్వాంటీటేటివ్ అప్టిట్యూడ్ - 35 మార్కులు.
మెయిన్స్ పరీక్షలు :
1).160 ప్రశ్నలకు 160 మార్కులను కేటాయించారు.
2). పరీక్ష సమయం 120 నిముషాలుగా ఉంది.
సిలబస్ :
జనరల్ /ఫైనాన్సియల్ అవేర్నెస్ - 30 మార్కులు
అవేర్నెస్ ఆన్ క్రెడిట్స్ కో - ఆపరేటివ్స్ - 10 మార్కులు
ఇంగ్లీష్ లాంగ్వేజ్ - 40 మార్కులు
రీసనింగ్ ఎబిలిటీ - 40 మార్కులు
క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ - 40 మార్కులు
జీతం :
కేటగిరీల వారీగా ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 26,080 నుండి 57,860 రూపాయలు వరకూ జీతం అందనుంది.
పరీక్ష కేంద్రాల ఎంపిక - నగరాలు :
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది నగరాలను పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసుకోవచ్చు.
హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్ మరియు వరంగల్.
0 Comments