జీతం 1,40,000 రూపాయలు, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ సంస్థలో రెగ్యులర్ పోస్టులు, ఇప్పుడే అప్లై చేసుకోండి, అస్సలు మిస్ కావద్దు.
మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఆధ్వర్యంలో ఉన్న ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన విడుదల అయినది.
ముఖ్యాంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ రైల్వే సంస్థకు చెందిన పోస్టులు.
2). రెగ్యులర్ పోస్టులు గా భర్తీ చేస్తున్నారు.
3). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే.
4). భారీ స్థాయిలో వేతనాలు.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో తెలిపారు. IRCON 40 Jobs 2022 Telugu
ఇర్కాన్ నుండి వచ్చిన ఈ నోటిఫికేషన్ లో పొందుపరచబడిన అతి ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : ఫిబ్రవరి 15, 2022
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : మార్చి 8, 2022
ఆన్లైన్ విధానంలో ఫీజు చెల్లించుటకు చివరి తేది : మార్చి 11,2022.
విభాగాల వారీగా ఖాళీలు :
అసిస్టెంట్ మేనేజర్ సివిల్ (E-1) - 20
ఎగ్జిక్యూటివ్ /సివిల్ (E-0) - 20
పోస్టులు :
మొత్తం 40 పోస్టులను తాజాగా వచ్చిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ /బోర్డుల నుండి 60%-75% మార్కులతో సివిల్ ఇంజనీరింగ్ విభాగాలలో ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులను పూర్తి చేసి, సంబంధిత విభాగాలలో అనుభవం ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
33 సంవత్సరాలు వయసు లోపు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం ఆయా కేటగిరీ లకు చెందిన అభ్యర్థులకు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
యూఆర్/ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 1000 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎస్సీ /ఎస్టీ /EWS/ఎక్స్ - సర్వీస్ మెన్ కేటగిరీ లకు చెందిన అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు :
వ్రాత పరీక్ష / ఇంటర్వ్యూ విధానం ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
కేటగిరీలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 30,000 నుండి 1,40,000 రూపాయలు వరకూ జీతం + ఇతర అలోవెన్స్ లు కూడా లభించనున్నాయి.
0 Comments