ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో భారీ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కానున్నాయా..?
పై ప్రశ్నకు అవును అనే సమాధానం వినిపించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నెమ్మది.. నెమ్మదిగా అడుగులు వేస్తున్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి.
తాజాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలు మరియు మండలాలు అనగా 13 జిల్లాలు మరియు సుమారుగా 679 మండలాల స్థాయిలలో ప్రభుత్వ విభాగాలలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల పోస్టుల సంఖ్యలను గుర్తించి వెంటనే తమకు పంపాలని
ఏపీ లో ఉన్న 13 జిల్లాల కలెక్టర్లకు ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి గారు సోమవారం నాడు ఒక ముఖ్యమైన మెమో ను జారీ చేసినట్లు,
ఈ సమాచారాన్ని మంగళవారం సాయంత్రమునకు అనగా ఫిబ్రవరి 1, 2022 సాయంత్రంనకు తమకు పంపాలని ఈ మెమో లో తెలిపినట్లు అధికారిక సమాచారం.
ఇటీవలే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సంక్షేమ మరియు సుస్థిర అభివృద్ధి లక్ష్యములను సాధించడానికి మరియు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయడానికి వీలుగా
ప్రభుత్వ విభాగాలలో ఉన్న అన్ని అతిముఖ్యమైన ఖాళీగా ఉన్న పోస్టులు అన్నిటిని భర్తీ చేయాలనీ అధికారులను ఆదేశాలు జారీ చేయడంతో,
అధికారులు ఏపీ లో ఉన్న అన్ని జిల్లాలు మరియు మండలాల ప్రభుత్వ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించి, భర్తీ చేసే విధంగా ప్రణాళికలు రచిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది.
ఖాళీలను గుర్తించే ప్రక్రియ పూర్తి అయిన వెంటనే ఏపీ లో ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన సమాచారం రానుంది.
0 Comments