ముఖ్యమంత్రి నోట ప్రభుత్వ ఉద్యోగాల మాట, 40 వేల ఉద్యోగాలకు అతి త్వరలో నోటిఫికేషన్స్ విడుదల కు సన్నాహాలు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులందరికి ఒక గుడ్ న్యూస్.
తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ విభాగాలలో ఖాళీగా ఉన్న సుమారుగా 40 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్లు స్వయానా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మీడియా వేదికగా ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రంలో నూతన జోనల్ విధానంను తీసుకుని వచ్చామని,దీనితో 95 శాతం ఉద్యోగాలు స్థానికులతో మాత్రమే భర్తీ చేయనున్నామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రకటన ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ గురించి అభ్యర్థులకు తెలిపారు.
స్వయానా ముఖ్యమంత్రివర్యులు చేసిన ఈ ప్రకటన ద్వారా తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలో 40,000 పోస్టుల భర్తీకి వరుసగా నోటిఫికేషన్స్ విడుదల కానున్నట్లు మనకు తెలుస్తుంది.
0 Comments