ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్రామ మరియు వార్డ్ సచివాలయాలలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 7,218 వాలంటీర్స్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా వచ్చింది.
తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామాల్లో 4213 ఖాళీలు మరియు నగరాల్లో 3005 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఖాళీగా ఉన్న ఈ 7218 పోస్టులను జిల్లా యూనిట్ గా తీసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లాల కలెక్టర్లకు తమ ఆదేశాలను జారీ చేసింది. AP Sachivalayam Update 2022
ఇకపై గ్రామ మరియు వార్డ్ సచివాలయాలలో ఖాళీగా ఉన్న వాలంటీర్స్ పోస్టుల భర్తీకి నెలలో రెండు సార్లు జిల్లాల జాయింట్ కలెక్టర్లు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.
రాబోయే రోజుల్లో ప్రతీ నెల 1వ మరియు 16వ తేదిలలో స్థానిక మండల పరిషత్ అభివృద్ధి అధికారులు (ఎంపీడీఓ) గ్రామాలు మరియు వార్డ్ సచివాలయలలో ఏర్పడే ఖాళీలను పురపాలక కమిషనర్లకు తెలపాలని ఈ ఉత్తర్వులలో తెలిపారు.
ఇకపై సరైన కారణం లేకుండా వరుసగా మూడు రోజుల పాటు తమ తమ విధులకు గైర్హాజరయ్యే వాలంటీర్స్ ను తొలగించి, ఏడవ రోజున ఆ వాలంటీర్ స్థానం ఖాళీ అయినట్లుగా గుర్తించాలని, తదుపరి ఖాళీలను భర్తీ చేయాలనీ ఈ ప్రకటన ద్వారా ప్రభుత్వం అధికారులను ఆదేశించినది.
0 Comments