896 కారుణ్య నియామకాల గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ మరియు రవాణా సంస్థ (APSRTC) నుండి ఒక అతి ముఖ్యమైన ప్రకటన వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేసిన నాటి కంటే ముందు పలు కారణాల వల్ల ప్రాణాలు కోల్పోయిన ఏపీ ఎస్ఆర్టీసీ సంస్థకు చెందిన ఉద్యోగస్తుల కుటుంబ సభ్యులకు వెంటనే కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు కల్పించాలని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ తాజాగా ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
ఇందుకోసం 2016 వ సంవత్సరం నుండి 2019 డిసెంబర్ నెల వరకూ ఆర్టీసీ సంస్థలో వృత్తి బాధ్యతలను నిర్వహిస్తూ ప్రాణాలను కోల్పోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు 896 మంది జాబితాను తయారుచేసిన ఆర్టీసీ ఎండీ, ఈ నివేదికను ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు.
ఆర్టీసీ ఎండి అందించిన నివేదికకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే తమ ఆమోదం తెలిపింది. APSRTC Latest Update Telugu 2022
ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ లో పనిచేస్తూ ప్రాణాలు కోల్పోయిన 896 మంది వారసులకు (కుటుంబ సభ్యులకు ), వారి వారి విద్యా అర్హతలను అనుసరించి,
ప్రాధాన్యత క్రమంలో గ్రామ మరియు వార్డు సచివాలయంలలో, ఆర్టీసీ లో మరియు జిల్లాలలోని ఇతర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఖాళీలలో పోస్టింగ్స్ ను ఉద్యోగాలను కల్పించాలని ఈ ఉత్తర్వులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
ఈ ప్రకటన పట్ల ఏపీఎస్ఆర్టీసీ లో పని చేస్తున్న ఉద్యోగ సంఘములు అన్ని తమ తమ సంతోషంను వ్యక్తం చేస్తున్నాయి.
TSRTC Update పూర్తి గా తెలుసుకోండి Click Here
0 Comments