ప్రముఖ బ్యాంక్ ఆఫ్ బరోడా కు చెందిన రిస్క్ మేనేజ్మెంట్ మరియు ఫ్రాడ్ రిస్క్ డిపార్టుమెంటులలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు :
1). ఇవి రెగ్యులర్ మరియు కాంట్రాక్టు బేసిస్ బ్యాంక్ ఉద్యోగాలు.
2). ఇరు తెలుగు రాష్ట్రముల వారు అప్లై చేసుకోవచ్చు.
3). భారీ స్థాయిలో వేతనాలు.
ఈ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి వచ్చిన ఈ నోటిఫికేషన్ లో పొందుపరిచిన అతి ముఖ్యమైన అంశాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. Bank of Baroda Jobs Recruitment 2022
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : మార్చి 15, 2022
విభాగాల వారీగా ఖాళీలు :
హెడ్/డిప్యూటీ హెడ్ - 11
సీనియర్ మేనేజర్స్ - 27
మేనేజర్స్ - 4
మొత్తం పోస్టులు :
42 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ ల నుండి సంబంధిత సబ్జెక్టు విభాగాలలో అనగా కంప్యూటర్ సైన్స్ /ఐటీ/డేటా సైన్స్/మెషిన్ లెర్నింగ్ లలో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/గ్రాడ్యుయేట్/బీఎస్సీ/బీసీఏ/ఎంసీఏ/చార్టెర్డ్ అకౌంటెంట్/ఎంబీఏ/పీజీడీఎం/ మాస్టర్ డిగ్రీ తదితర కోర్సులను పూర్తి చేయవలెను.
సంబంధిత సబ్జెక్టు విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
24 నుండి 55 సంవత్సరాలు వయసు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పొస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
బ్యాంక్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యంగులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్/ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 600 రూపాయలు మరియు మిగిలిన కేటగిరీ అభ్యర్థులు 100 రూపాయలును దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎలా ఎంపిక చేస్తారు :
షార్ట్ లిస్ట్ /పర్సనల్ ఇంటర్వ్యూ విధానం ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
ప్రాధాన్యతను అనుసరించి ఉద్యోగ ఎంపిక విధానంలో మార్పులు ఉండవచ్చు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 1,48,000 నుండి 1,78,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
0 Comments