భారత సివిల్ సర్వీస్ లలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న సుమారు 861 పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.
2). యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఆధ్వర్యంలో భర్తీ కానున్నాయి.
3). ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
4). భారీ స్థాయిలో వేతనాలు.
ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూ అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ప్రకటనలో పొందుపరిచారు.
యూపీఎస్సీ నుండి వచ్చిన ఈ తాజాగా వచ్చిన ప్రకటనలో పొందుపరిచిన ముఖ్యమైన అంశాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. Civil Service Jobs Recruitment 2022 Telugu
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : ఫిబ్రవరి 22, 2022
ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ తేది : జూన్ 5, 2022.
ఉద్యోగాలు - వివరాలు :
సివిల్స్ స్థాయి పోస్టులు - 861
విభాగాల వారీగా ఉద్యోగాలు :
పోస్ట్ లు |
---|
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ |
ఇండియన్ ఫారిన్ సర్వీస్ |
ఇండియన్ పోలీస్ సర్వీస్ |
ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్, గ్రూప్ - ఏ |
ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్, గ్రూప్ - ఏ |
ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్, గ్రూప్ - ఏ |
ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్, గ్రూప్ - ఏ |
ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్, గ్రూప్ - ఏ |
ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, జూనియర్ గ్రేడ్ గ్రూప్ - ఏ |
ఇండియన్ పోస్టల్ సర్వీస్, గ్రూప్ - ఏ |
ఇండియన్ పీ & టీ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీస్, గ్రూప్ - ఏ |
ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్, గ్రూప్ - ఏ |
ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (కస్టమ్స్ & ఇండైరెక్ట్ టాక్స్ ), గ్రూప్ -ఏ |
ఇండియన్ రెవిన్యూ సర్వీస్ ( ఇన్కమ్ టాక్స్ ), గ్రూప్ - ఏ |
ఇండియన్ ట్రేడ్ సర్వీస్, గ్రూప్ - ఏ |
అర్మ్డ్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ సివిల్ సర్వీస్, గ్రూప్ - బీ(సెక్షన్ ఆఫీసర్స్ గ్రేడ్ ) |
DANICS, గ్రూప్ - బీ |
DANICS, గ్రూప్ - బీ |
DANIPS, గ్రూప్ - బీ |
మొత్తం పోస్టులు :
పైన తెలిపిన విభాగాలలో మొత్తం 861 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ఏదైనా విభాగాలలో గ్రాడ్యుయేషన్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
21 నుండి 32 సంవత్సరాలు వయసు వరకూ గల అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
సెంట్రల్ గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 100 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
మిగిలిన కేటగిరీ అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు మరియు ఇంటర్వ్యూ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాల వారీగా ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 50,000 కూ పైగా సుమారుగా జీతములు మరియు ఇతర అలోవెన్స్ లు లభించనున్నాయి.
పరీక్ష కేంద్రముల ఎంపిక - నగరాలు :
ఇరు తెలుగు రాష్ట్రములకు చెందిన అభ్యర్థులు హైదరాబాద్/తిరుపతి /విజయవాడ/విశాఖపట్నం /వరంగల్ నగరాలను ప్రిలిమ్స్ పరీక్షల కేంద్రాలుగా ఎంపిక చేసుకోవచ్చు.
మరియు మెయిన్స్ పరీక్షలకు హైదరాబాద్ మరియు విజయవాడ నగరాలను అభ్యర్థులు పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసుకోవచ్చు.
0 Comments