Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Govt Jobs 2022 : ఫ్లాష్ న్యూస్, 7.5 లక్షల ఉద్యోగాల భర్తీపై అధికారిక ప్రకటన, అస్సలు మిస్ కావద్దు.

భారత పార్లమెంట్ వేదికగా ఇటీవలే 2022-23 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశాలు మొదలు అయ్యాయి.

ఈ నేపథ్యంలోనే గురువారం నాడు రాజ్య సభ వేదికగా సదరు సభ్యుడు ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న ప్రభుత్వ ఖాళీల సంఖ్య గురించి ఒక ప్రశ్నను వేశారు.

ఈ ప్రశ్నకు సమాధానంగా,రాజ్యసభ వేదికగా కేంద్ర ప్రభుత్వం వద్ద ఇప్పటివరకూ 2020 వ సంవత్సరం మార్చి 1వ తేది నాటికి 7,56,146 గ్రూప్ -సీ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు లెక్క తేలిందని, ఈ ఏడున్నర లక్షల సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులే కాకుండా. 

గ్రూప్ - ఏ విభాగానికి చెందిన మరో 21,255 పోస్టులు కూడా ఖాళీగా ఉన్నట్లుగా భారత దేశ ప్రధానమంత్రి కార్యాలయ మంత్రి తెలిపారు.

ఆరవ వేతన సవరణ సంఘం ఇచ్చిన తాజా సిఫార్సుల మేరకూ గ్రూప్ - డీ పోస్టులన్నిటిని గ్రూప్ - సీ పోస్టులుగా అప్ గ్రేడ్ చేశామని, ఇకపై కేంద్ర ప్రభుత్వములో గ్రూప్ - డీ ఉద్యోగాలు అనేవి ఉండబోవు అని ఈ ప్రకటనలో తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అనునది నిరంతర ప్రక్రియ అని, వివిధ ప్రభుత్వ విభాగాలలో ఖాళీగా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులన్నిటిని భర్తీ ప్రక్రియను చేపట్టాలని 

జూన్ 3, 2021 నాడు సూచనలను జారీ చేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయమునకు చెందిన మంత్రివర్యులు తెలిపారు.

పై ప్రకటనను బట్టి చూస్తే, రాబోయే రోజుల్లో ఎన్నికలు కూడా సమిపిస్తున్నాయి కాబట్టి, 2022-2023 సంవత్సరాలులో కేంద్ర ప్రభుత్వ విభాగాలలో ఖాళీగా ఉన్న ఈ ఏడున్నర లక్షల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల అవ్వనున్నాయి అనే విషయం మనకు సుస్పష్టంగా తెలుస్తుంది. 

కాకినాడ లో ఉద్యోగాలు Click Here

Post a Comment

0 Comments