హైదరాబాద్ సర్కిల్ పరిధిలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ సబార్డినేట్ క్యాడర్ లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ఈ పోస్టులకు అర్హతలు గల హైదరాబాద్ జిల్లాలోని అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రకటనలో తెలిపారు.
పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పంజాబ్ నేషనల్ బ్యాంక్, హైదరాబాద్ లోని బ్రాంచ్ లలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ఈ ప్రకటనలో పొందుపరిచిన అతి ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది : మార్చి 4, 2022.
ఉద్యోగాలు - వివరాలు :
సబార్డినేట్ క్యాడర్ ప్యూన్ - 24
విభాగాల వారీగా ఖాళీలు :
ఎస్సీ - 4
ఎస్టీ - 1
ఓబీసీ - 7
Ews - 2
జనరల్ - 10
మొత్తం పోస్టులు :
24 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ఇంటర్మీడియట్ కోర్సును పూర్తి చేసి, ఇంగ్లీష్ భాషలో ప్రాథమికంగా చదవడం /వ్రాయగలిగే పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
18-24 సంవత్సరాలు వయసు గల అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు దివ్యంగులకు 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్స్యేషన్ కలదు
ఎలా అప్లై చేసుకోవాలి:
సంబంధిత విద్యా ద్రువికరణ పత్రాలను జతపరచి ఈ క్రింది అడ్రస్ కు నిర్ణిత గడువు చివరి తేది లోగా అభ్యర్థులు తమ దరఖాస్తులను రిజిస్టర్ /స్పీడ్ పోస్టుల ద్వారా పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులు లేవు.
ఎలా ఎంపిక చేస్తారు:
బ్యాంక్ మార్గదర్శకాలను అనుసరించి విద్యా అర్హతలు మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 14,500 రూపాయలు నుండి 28,145 రూపాయలు వరకూ జీతం అందనుంది.
జతపరచవల్సిన డాక్యుమెంట్స్ :
డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్
10వ/12వ తరగతి మార్క్స్ లిస్ట్స్
స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్స్ /టీసీ
నివాస మరియు కుల ద్రువీకరణ పత్రములు
పీహెచ్ /ews సర్టిఫికెట్స్
ఆధార్ కార్డ్
పాన్ కార్డ్
దరఖాస్తులు పంపవల్సిన అడ్రస్ :
పంజాబ్ నేషనల్ బ్యాంక్,
సర్కిల్ ఆఫీస్,
హైదరాబాద్ - రిజెన్సీ ప్లాజా,
1వ అంతస్తు, ఫ్లాట్ నెంబర్ 3,
ఇం.నెం.7-1-450/RP/3/1/A,
మైత్రి విహర్ ఏరియా,
అమీర్ పేట్,
హైదరాబాద్ - 500016.
0 Comments