ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో ఖాళీగా ఉన్న సుమారు 151 పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటనను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) తాజాగా విడుదల చేసినది.
ముఖ్యాంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.
2). డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్దతిలో భర్తీ చేయనున్నారు.
3). యూపీఎస్సీ ఆధ్వర్యంలో భర్తీ ప్రక్రియ జరుగనుంది.
4). భారీ స్థాయిలో వేతనాలు.
ఐ.ఎఫ్.ఎస్ నుండి తాజాగా వచ్చిన ఈ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
ఈ పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్ లో ఇచ్చిన అతి ముఖ్యమైన అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : ఫిబ్రవరి 22, 2022
ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ తేది : జూన్ 5, 2022
మెయిన్స్ నిర్వహణ తేది : నవంబర్, 2022
విభాగాల వారీగా ఖాళీలు :
ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ - 151
మొత్తం పోస్టులు :
తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా మొత్తం 151 పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి అనిమల్ హస్బెండరీ & వెటర్నరీ సైన్స్ /బోటనీ /కెమిస్ట్రీ /జియోలజీ/మాథ్ మెటిక్స్ /ఫిజిక్స్ /స్టాటస్టిక్స్ /జూవలజీ /అగ్రికల్చర్ /ఫారెస్ట్రీ విభాగాలలో బాచిలర్ డిగ్రీ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అని నోటిఫికేషన్ లో తెలిపారు.
వయసు :
21 నుండి 32 సంవత్సరాలు వరకూ వయసు గల అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీలకు మరియు ఎక్స్ - సర్వీస్ మెన్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 100 రూపాయలను దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.
మిగిలిన కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు మరియు పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 50,000 రూపాయలు పైన జీతం మరియు ఇతర అలోవెన్స్ లు కూడా లభించనున్నాయి.
పరీక్ష కేంద్రముల ఎంపిక - నగరాలు :
ఈ పోస్టులకు అప్లై చేసుకునే ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్షలు వ్రాయడానికి గానూ హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాలను పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసుకోవచ్చు.
మరియు మెయిన్స్ పరీక్షలు వ్రాయడానికి హైదరాబాద్ నగరాన్ని ఎగ్జామినేషన్ సెంటర్ గా ఎంపిక చేసుకోవచ్చు.
0 Comments