భారత దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో 2,65,547 రైల్వే పోస్టులు ఖాళీగా ఉన్నాయి అని భారతీయ రైల్వే శాఖ మంత్రివర్యులు రాజ్యసభ వేదికగా స్పష్టం చేశారు.
తాజాగా జరుగుతున్న రాజ్యసభ సమావేశాలలో భాగంగా ఒక సభ్యుడు భారతీయ రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను అడుగగా,
సభ్యుని ప్రశ్నకు సమాధానంగా భారతీయ రైల్వే శాఖ మంత్రివర్యులు దేశావ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో కలిపి మొత్తం 2,65,547 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు రాజ్యసభ వేదికగా ప్రకటించడం జరిగింది. Railway 2,65,547 Vacancies Update
గడిచిన ఐదు సంవత్సరాలలో రైల్వే శాఖలో గ్రూప్ - సీ లెవెల్ 1,89,790 పోస్టులను భర్తీ చేసినట్లు మంత్రివర్యులు తెలిపారు.
తాజాగా దేశావ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో గేజిటెడ్ పోస్టులు సంఖ్య 2,177 మరియు నాన్ - గేజిటెడ్ పోస్టులు సంఖ్య 2,63,370 గా ఉన్నట్లు, మొత్తం గేజిటెడ్ మరియు నాన్ - గేజిటెడ్ పోస్టులన్నీ కలిపి 2,65,547 గా ఉన్నట్లు రైల్వే శాఖ మంత్రివర్యులు తెలిపారు.
ఇక ఇరు తెలుగు రాష్ట్రలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన దక్షిణ మధ్య రైల్వేలో 43 గేజిటెడ్ పోస్టులు మరియు 16,741 నాన్ - గేజిటెడ్ పోస్టులు వెరసి మొత్తం దక్షిణ మధ్య రైల్వే మొత్తం 16,784 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు
భారత రైల్వే శాఖ మంత్రివర్యులు రైల్వే శాఖలో ఉన్న ఖాళీలపై రాజ్య సభ వేదికగా అధికారికంగా ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
కేంద్ర రైల్వే శాఖ మంత్రివర్యులు తాజాగా చేసిన ప్రకటన ద్వారా, రాబోయే రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో త్వరలోనే ఈ 2,65,547 రైల్వే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల కావడం తథ్యంగా కనిపిస్తుంది.
0 Comments