Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Indian Navy 1531 Jobs Recruitment : వైజాగ్ లో కూడా పోస్టింగ్స్ ఇండియన్ నేవీ లో 1531 పోస్టులు జీతం 63,200 రూపాయలు

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఉన్న ఇండియన్ నేవీ లో సివిలియన్ పర్సనల్ విభాగంలో ఖాళీగా ఉన్న ట్రేడ్స్ మెన్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.

ముఖ్యాంశాలు   :

1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.

2). గ్రూప్ - సీ నాన్ - గేజిటెడ్ విభాగానికి చెందిన పోస్టులు.

3). భారీ సంఖ్యలో పోస్టుల భర్తీ

4). భారీ స్థాయిలో వేతనాలు.

ఈ పోస్టులకి అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ముంబై, విశాఖపట్నం, కొచ్చి తదితర ప్రాంతాలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

ఇండియన్ నేవీ లో భర్తీ చేయనున్న ఈ పోస్టులకు సంబంధించిన వివరాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు  :

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది  : ప్రకటన వచ్చిన 28 రోజుల లోపు..

విభాగాల వారీగా ఖాళీలు   :

పోస్ట్ పేరు ఖాళీలు
ఎలక్ట్రికల్ ఫిట్టర్ 164
ఎలక్ట్రా ప్లేటర్ 10
ఇంజిన్ ఫిట్టర్ 163
ఫౌండరీ 6
పాటర్న్ మేకర్ 8
ఐసీఈ ఫిట్టర్ 110
ఇన్స్ట్రుమెంట్ ఫిట్టర్ 31
మెషినిస్ట్ 70
మిల్ రైట్ ఫిట్టర్ 51
పెయింటర్ 53
ప్లేటర్ 60
షీట్ మెటల్ వర్కర్ 10
పైప్ ఫిట్టర్ 77
రెఫ్ & ఏసీ ఫిట్టర్ 46
టైలర్ 17
వెల్డర్ 89
రాడర్ ఫిట్టర్ 37
రేడియో ఫిట్టర్ 21
రిగ్గర్ 55
షిప్ రైట్ 102
బ్లాక్ స్మిత్ 7
బొల్లర్ మేకర్ 21
సివిల్ వర్కర్స్ 38
కంప్యూటర్ ఫిట్టర్ 12
ఎలక్ట్రానిక్ ఫిట్టర్ 47
జిరో ఫిట్టర్ 7
మెషినరీ కంట్రోల్ ఫిట్టర్ 8
సోనార్ ఫిట్టర్ 19
వెపన్ ఫిట్టర్ 47
హాట్ ఇన్సూలెటర్ 3
షిప్ ఫిట్టర్ 17
జీటీ ఫిట్టర్ 36
ఐస్ ఫిట్టర్ క్రేన్ 89

మొత్తం పోస్టులు  :

1531 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ / బోర్డు ల నుండి మెట్రిక్యూలేషన్ ను పూర్తి చేసి, సంబంధిత ట్రేడ్ విభాగాలలో అప్ప్రెంటీస్ షిప్ ట్రైనింగ్ లను పూర్తి చేసిన (లేదా ) ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ లలో రెండు సంవత్సరాల సర్వీస్ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

వయసు :

18 నుండి 25 సంవత్సరాలు వయసు లోపు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు దివ్యంగులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు  :

ఫీజులకు సంబంధించిన వివరాలను ఈ ప్రకటనలో పొందుపరచలేదు.

ఎలా ఎంపిక చేస్తారు:

షార్ట్ లిస్ట్ మరియు వ్రాత పరీక్షల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

పరీక్ష - సిలబస్ వివరాలు  :

మొత్తం 100 మార్కులకు పరీక్షను నిర్వహించనున్నారు.

జనరల్ ఇంటలిజెన్స్ అండ్ రీజనింగ్      -     10 మార్కులు

న్యూమరికల్ ఆప్టీట్యూడ్                             -     10 మార్కులు

జనరల్ ఇంగ్లీష్                                           -     10 మార్కులు

జనరల్ అవేర్నెస్                                        -     20 మార్కులు

ట్రైనింగ్ అప్ప్రెంటీస్ స్కూల్ /ట్రేడ్స్      -    50 మార్కులు

జీతం  :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 19,900 రూపాయలు నుండి 63,200 రూపాయలు వరకూ జీతం అందనుంది.

Website

Apply Link

Notification

Login Link

Post a Comment

0 Comments