తెలంగాణ రాష్ట్రమునకు చెందిన రోడ్ రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఒక వినూత్న ఆలోచనకు తెరతీసింది.
టీఎస్ఆర్టీసీ కు సంబంధించిన 200 పడకల సొంత ఆసుపత్రి తెలంగాణ రాష్ట్రంలోని తార్నాక లో ఉంది.ఇటీవలే ఈ ఆసుపత్రిని కార్పొరేట్ ఆసుపత్రి స్థాయికి తీసుకెళ్లే విధంగా ఆర్టీసీ ఎండీ ప్రణాళికలు రచిస్తున్నారు.
24/7 ప్రజలకు మరియు ఆర్టీసీ లో వృత్తి బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగస్తులు మరియు వారి కుటుంబ సభ్యులకు అత్యుత్తమమైన వైద్య సదుపాయాలను కల్పించేందుకు వీలుగా తాజాగా ఈ హాస్పిటల్ కు చెందిన పలు విభాగాలలో వైద్యులు, సిబ్బంది, ల్యాబ్, ఫార్మసీ సిబ్బంది ని నియమించడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లుగా తెలుస్తుంది. TSRTC Latest Update 2022 Telugu
వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానున్నట్లు అధికారికంగా మీడియా నుండి సమాచారం అందుతుంది.
తార్నాక లో ఉన్న ఈ ఆర్టీసీ ఆసుపత్రి పూర్తి స్థాయిలు సిద్ధం అయిన వెంటనే ఆర్టీసీ హాస్పిటల్ కు అనుబంధంగా ఒక ఆర్టీసీ మెడికల్ (వైద్య ) కళాశాలను కూడా ఏర్పాటు చేయడానికి,
ఇందులో 20 శాతం మేరకు సీట్లను ఆర్టీసీ ఉద్యోగస్తుల కుటుంబ సభ్యులకు కేటాయించే విధంగా టీఎస్ఆర్టీసీ సంస్థ ఏండి గారు ఆధ్వర్యంలో ప్రణాళికలు రచించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదికను అందజేయనున్నట్లు మీడియా కథనల ద్వారా మనకు తెలుస్తుంది.
More APSRTC Updates Click Here
0 Comments