గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు ఆధ్వర్యంలో ఉన్న చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు :
1).ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.
2). భారీ స్థాయిలో వేతనాలు.
3). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే.
4).కాంట్రాక్టు బేసిస్ లో భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటన లో పొందుపరిచారు.
చెన్నై మెట్రో రైల్ నుండి వచ్చిన ఈ ప్రకటనలో ఉన్న ముఖ్యమైన విషయాలన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం. Metro Jobs 2022 No exam High salary
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది : మార్చి 11, 2022.
విభాగాల వారీగా ఖాళీలు :
పోస్ట్ లు | ఖాళీలు |
---|---|
జనరల్ మేనేజర్ (అండర్ గ్రౌండ్ కన్స్ట్రక్షన్ ) | 1 |
అడిషనల్ జనరల్ మేనేజర్ (అండర్ గ్రౌండ్ కన్స్ట్రక్షన్ ) | 2 |
జాయింట్ జనరల్ మేనేజర్ (అండర్ గ్రౌండ్ కన్స్ట్రక్షన్ ) | 2 |
డిప్యూటీ జనరల్ మేనేజర్ (క్యూఏ&క్యూసీ) | 1 |
డిప్యూటీ జనరల్ మేనేజర్ (సేఫ్టీ ) | 1 |
మేనేజర్ ( క్యూఏ&క్యూసీ ) | 2 |
మేనేజర్ ( డిజైన్ ) | 2 |
డిప్యూటీ మేనేజర్ (క్యూఏ/క్యూసీ ) | 2 |
డిప్యూటీ మేనేజర్ (సేఫ్టీ ) | 1 |
డిప్యూటీ మేనేజర్ (డిజైన్ ) | 1 |
అసిస్టెంట్ మేనేజర్ (క్యూఏ&క్యూసీ) | 2 |
అసిస్టెంట్ మేనేజర్ (సేఫ్టీ ) | 1 |
అసిస్టెంట్ మేనేజర్ (డిజైన్ ) | 1 |
మొత్తం పోస్టులు :
19 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల నుండి సంబంధిత సబ్జెక్టు విభాగాలలో సివిల్/స్ట్రక్చరల్ తదితర విభాగాలలో బీ.ఈ/బీ. టెక్/ఎం.ఈ/ఎం.టెక్/పీజీ/డిప్లొమా కోర్సులను పూర్తి చేయవలెను.
మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
30-55 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న అభ్యర్థులు కేటగిరీలా వారీగా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
సంస్థ గైడ్ లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్స్యేషన్ ఉండే అవకాశాలు ఉన్నాయి.
ఎలా అప్లై చేసుకోవాలి :
అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు ఫారం ను నింపిన తదుపరి అప్లికేషన్ ఫారం నకు సంబంధిత విద్యా ద్రువీకరణ పత్రాలను జతపరచి ఈ క్రింది అడ్రస్ కు నిర్ణిత గడువు చివరి తేది లోగా పోస్ట్ /కొరియర్ ద్వారా పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్/యూఆర్/ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 300 రూపాయలను మరియు ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 50 రూపాయలను దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎలా ఎంపిక చేస్తారు..?
ఇంటర్వ్యూ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
కేటగిరీ లను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 60,000 రూపాయలు నుండి 2,25,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
దరఖాస్తులు పంపవల్సిన చిరునామా (అడ్రస్ ) :
Joint General Manager (HR),
Chennai Metro Rail Limited,
CMRL Depot, Admin Building,
Poonamallee High Road,
Koyambedu, Chennai - 600107.
0 Comments