జీతం 50,000 రూపాయలు వరకూ, NTPC లిమిటెడ్ లో 177 ఉద్యోగాలు, ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే,వెంటనే అప్లై చేసుకోండి.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ ప్రైస్ ఆధ్వర్యంలో ఉన్న కోల్ మైనింగ్ హెడ్ క్వార్టర్స్ కు చెందిన ఎన్టీపీసీ (NTPC) లిమిటెడ్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన విడుదల అయినది.
ముఖ్యాంశాలు:
1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన ఉద్యోగాలు.
2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు.
3). భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ.
4). ఫిక్స్డ్ టర్మ్ బేసిస్ లో ఈ పోస్టుల భర్తీని చేపట్టనున్నారు.
5). భారీ స్థాయిలో వేతనాలు.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : మార్చి 15, 2022
విభాగాల వారీగా ఖాళీలు :
మైనింగ్ సిర్దార్ - 103
మైనింగ్ ఓవర్ మెన్ - 74
మొత్తం పోస్టులు :
177 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు 10వ తరగతి /డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ కోర్సులు మరియు డీజీఎంఎస్ నుండి కోల్ అండ్ వాలీడ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్/ఓవర్ మెన్ సర్టిఫికెట్ తదితర అర్హతలను కలిగి ఉండాలని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
57 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ /ews/ఓబీసీ కేటగిరీ లకు చెందిన అభ్యర్థులు 300 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎలా ఎంపిక చేస్తారు:
వ్రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
కేటగిరీ లను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 40,000 రూపాయలు నుండి 50,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
ఈ జీతంతో పాటు హెచ్. ఆర్. ఏ + మెడికల్ ఫెసిలిటీస్ తదితర బెనిఫిట్స్ కూడా లభించనున్నాయి.
0 Comments