ఫ్లాష్ న్యూస్, 670 జూనియర్ అసిస్టెంట్ & కంప్యూటర్ అసిస్టెంట్ పరీక్షలకు వారం లోపు పరీక్షల షెడ్యూల్ విడుదల,APPSC నుండి వచ్చిన అధికారిక ప్రకటన, ప్రిపరేషన్ వేగాన్ని పెంచండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవిన్యూ డిపార్టుమెంటు లో ఖాళీగా ఉన్న 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి
మరియు ఏపీ దేవాదాయ ధర్మదాయ శాఖలో ఖాళీగా ఉన్న 60 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్స్ ను గత సంవత్సరం 2021 డిసెంబర్ నెల 28వ తేదీన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. APPSC 730 Group 4 Jobs Exam Update 2022
ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్ష తేదీల షెడ్యూల్ ను రాబోయే వారంలో ప్రకటిస్తామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ ) కార్యదర్శి ఒక ప్రముఖ న్యూస్ మీడియా ఛానెల్ & న్యూస్ పేపర్ కు ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
రాబోయే వారంలో 670 ఏపీ రెవెన్యూ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ మరియు 60 ఏపీ ఎండో మెంట్ డిపార్టుమెంటు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (గ్రేడ్ - 3) పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ ను ప్రకటించి,
వేగంగా ఈ పోస్టులను భర్తీ చేస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి ఈ ప్రకటన ద్వారా అభ్యర్థులకు తెలిపారు.
అభ్యర్థుల అభ్యర్థన మేరకు ఇప్పటి వరకూ మూడు సార్లు ఈ పోస్టులకు దరఖాస్తు గడువును పెంచామని, మొత్తం ఇప్పటివరకు నాలుగు లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.
ఏపీపీఎస్సీ నుండి తాజాగా వచ్చిన ప్రకటన ద్వారా అతి త్వరలోనే ఈ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కాబోతుంది అని మనకు తెలుస్తుంది.
కావున, ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు మీ మీ ప్రిపరేషన్ వేగాన్ని పెంచవల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మనం చెప్పుకోవచ్చు.
అభ్యర్థులు ప్రతీ రోజు మన వెబ్సైటు ను చూడగలరు. మరియు పోటీపరీక్షలకు ఉచితంగా ప్రిపేర్ అవ్వగలరు.
0 Comments