పరీక్ష లేదు, విశాఖపట్నం లో ప్రభుత్వ ఉద్యోగాలు, 15 రోజుల లోపు పోస్టింగ్స్, ఇప్పుడే అప్లై చేసుకోండి, అస్సలు మిస్ కావద్దు.
గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్,మెడికల్ అండ్ హెల్త్ డిపార్టుమెంటు ఆధ్వర్యంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ చెస్ట్ అండ్ సీ. డి., విశాఖపట్నం లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు :1). ఇవి ప్రభుత్వానికి చెందిన పారా మెడికల్ పోస్టులు.
2). అవుట్ సోర్సింగ్ పద్దతిలో భర్తీ చేయనున్నారు.
3). గౌరవస్థాయిలో వేతనాలు.
4). దరఖాస్తు ప్రక్రియ పూర్తి అయిన 15 రోజుల లోపులోనే పోస్టింగ్స్ కల్పించనున్నారు.
ఈ పోస్టులకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వైజాగ్ నగరంలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
తాజాగా వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన ముఖ్యమైన అంశాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది : ఫిబ్రవరి 12, 2022 ( 5 PM ).
మెరిట్ లిస్ట్ విడుదల తేది : ఫిబ్రవరి 15, 2022
ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేది : ఫిబ్రవరి 19, 2022
ఆర్డర్స్ ఇష్యూ తేది : ఫిబ్రవరి 21, 2022
సెలెక్టెడ్ అభ్యర్థులు జాయినింగ్ తేది : ఫిబ్రవరి 25, 2022
విభాగాల వారీగా ఖాళీలు :
ఈ. సీ. జీ. టెక్నీషియన్ - 2
డార్క్ రూమ్ అసిస్టెంట్ - 1
ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ - 2
మొత్తం పోస్టులు :
5 పోస్టులను తాజాగా వచ్చిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి 10వ తరగతి / ఇంటర్ /ఈసీజి టెక్నీషియన్ కోర్సు /డార్క్ రూమ్ అసిస్టెంట్ కోర్సు /ఏపీ పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ మొదలైన కోర్సులను పూర్తి చేయవలెను.
వయసు :
42 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు .
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ,బీసీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు దివ్యంగులకు 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్స్యేషన్ కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
అభ్యర్థులు ఈ క్రింది వెబ్సైటు లింక్ ద్వారా దరఖాస్తు ఫారం ను డౌన్లోడ్ చేసుకుని, తదుపరి అప్లికేషన్ ఫారం ను నింపి, సంబంధిత విద్యా ద్రువికరణ పత్రాలను జతపరచి నిర్ణిత గడువు చివరి తేదిమరియు సమయం లోగా ఈ క్రింది చిరునామా కు పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
300 రూపాయలను దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.
ఎలా ఎంపిక చేస్తారు:
విద్యా అర్హతల మార్కులు, అనుభవం ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 12,000 రూపాయలు నుండి 17,500 రూపాయలు వరకూ జీతంగా లభించనుంది.
దరఖాస్తులు పంపవల్సిన చిరునామా :
SUPERINTENENT,
GOVT. HOSPITAL FOR CHEST AND C. D.,
PEDA WALTAIR,
VISAKHAPATNAM - 530017.
0 Comments