గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కు చెందిన మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ మేనేజ్మెంట్ (MANAGE), హైదరాబాద్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.
2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే.
3). భారీ స్థాయిలో వేతనాలు.4). కాంట్రాక్టు బేసిస్ లో ఉద్యోగాల భర్తీ.
5). ఎటువంటి పరీక్షలు లేవు.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో తెలిపారు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్ లో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ నుండి వచ్చిన ఈ ప్రకటన గురించి మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. Agriculture Jobs 2022 Telugu
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : మార్చి 31, 2022.
విభాగాల వారీగా ఖాళీలు :
మేనేజర్ - ఫైనాన్స్ - 1
మేనేజర్ - మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ - 1
బిజినెస్ ఎగ్జిక్యూటివ్ - 1
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి ఎంబీఏ/ఎంసీఏ/పీజిడీఎం/మాస్టర్ డిగ్రీ ఇన్ అగ్రి - బిజినెస్ /ఫైనాన్స్/మార్కెటింగ్/అగ్రి మార్కెటింగ్/ఎకనామిక్స్/అగ్రి ఎకనామిక్స్/టెక్నాలజీ కమర్షియలైజెషన్/ఎంటర్ప్రేన్యూర్ షిప్ కోర్సులను పూర్తి చేసి, గుడ్ వెర్బల్ /రిటెన్ కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్, ఎంఎస్ ఆఫీస్ మరియు ఇంటర్నెట్ తదితర విషయాలపై అవగాహన ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో తెలిపారు.
వయసు :
50 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
షార్ట్ లిస్ట్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ విధానాలను అనుసరించి ఈ పోస్టులకి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
కేటగిరి లను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 30,000 రూపాయలు నుండి 1,25,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
0 Comments