Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AIIMS Jobs 2022 : ఎయిమ్స్, మంగళగిరి లో ఉద్యోగాలు

జీతం 56,100 - 1,77,500 రూపాయలు, ఎయిమ్స్, మంగళగిరి లో ఉద్యోగాలు, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో పోస్టుల భర్తీ, ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే, అస్సలు మిస్ కావద్దు, అప్లై చేసుకోండి ఇలా.   

AIIMS Jobs 2022

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంగళగిరిలో ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) లో ఖాళీగా ఉన్నా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది. AIIMS Jobs 2022

ముఖ్యాంశాలు: 

1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.

2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు.

3). భారీ స్థాయిలో వేతనాలు.

4). డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ లో భర్తీ.

ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని, ఈ ప్రకటనలో పొందుపరిచారు.

ఎయిమ్స్, మంగళగిరి నుండి వచ్చిన ఈ ప్రకటన గురించి మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు  :

ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ దరఖాస్తులకు చివరి తేది  :   ప్రకటన వచ్చినా 30 రోజుల లోపు.

విభాగాల వారీగా ఖాళీలు  :

ట్యూటర్ /క్లినికల్ ఇన్స్ట్రక్టర్, కాలేజ్ ఆఫ్ నర్సింగ్  -  17

మొత్తం పోస్టులు  :

17 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ / యూనివర్సిటీల నుండి బీ.ఎస్సీ (నర్సింగ్ డిగ్రీ ) కోర్సులను లేదా రిజిస్టర్డ్ నర్స్ అండ్ మిడ్ వైఫ్ విత్ సిస్టర్ ట్యూటర్స్ డిప్లొమా, టీచింగ్ ఇన్స్టిట్యూట్ లో మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు.

వయసు :

35 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యంగులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మొదటగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవలెను.

తదుపరి దరఖాస్తు ఫారం మరియు ఇతర విద్యా ధ్రువీకరణ పత్రముల హార్డ్ కాపీ లను నిర్ణిత గడువు  చివరి తేది లోగా క్రింది అడ్రస్ కు ఆఫ్ లైన్ విధానంలో పంపవలెను.

దరఖాస్తు ఫీజు   :

జనరల్ / ఓబీసీ/ews  కేటగిరీ అభ్యర్థులు 1000 రూపాయలును మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 800 రూపాయలును దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.

ఎలా ఎంపిక చేస్తారు:

షార్ట్ లిస్ట్ / స్క్రీనింగ్ టెస్ట్ / ఇంటర్వ్యూ విధానాలను అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం   :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 56,100 రూపాయలు నుండి 1,77,500 రూపాయలు వరకూ జీతం అందనుంది.

దరఖాస్తులు(హార్డ్ కాపీలు) పంపవల్సిన అడ్రస్  :

The Recruitment Cell

AIIMS Mangalagiri

Old TB Sanatorium Road, Mangalagiri

Gunturu (Dist.), Andhrapradesh

PIN - 522 503.

Apply Link

Notification

Post a Comment

0 Comments