ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణ జిల్లాలోని వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక ప్రకటన కలెక్టర్ కార్యాలయం, కృష్ణా జిల్లా నుండి తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు :
1). ఇవి ప్రభుత్వానికి సంబంధించిన బ్యాక్ లాగ్ పోస్టులు.
2). వికలాంగులు మాత్రమే దరఖాస్తులకు అర్హులు.
3). గ్రూప్ - 4 ఉద్యోగాలు కూడా ఉన్నాయి.
4). 7వ తరగతి & 8వ తరగతి అర్హతలతో కూడా పోస్టులు ఉన్నాయి.
5). కొన్ని పోస్టులకు చదవడం & వ్రాయడం వస్తే సరిపోతుంది అని తెలిపారు.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
కృష్ణ జిల్లా నుండి వచ్చిన ఈ తాజా ప్రకటన గురించి మరింత ముఖ్యమైన సమాచారం మనం ఇప్పుడు తెలుసుకుందాం. AP Collector Office Jobs
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది : ప్రకటన వచ్చిన 15 రోజుల లోపు.
విభాగాల వారీగా ఖాళీలు :
గ్రూప్ - 4 ఉద్యోగాలు :
టైపిస్ట్ - 1
టెక్నికల్ ఉద్యోగాలు :
ఫిట్టర్ బెడ్ ఆపరేటర్ - 1
క్లాస్ - 4 ఉద్యోగాలు :
ఆఫీస్ సబార్డినేట్ - 3
స్వీపర్ - 1
మొత్తం పోస్టులు :
6 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ /బోర్డుల నుండి డిగ్రీ ఉత్తిర్ణత, తెలుగు & ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ లో ఉత్తిర్ణత మరియు కంప్యూటర్ పరిజ్ఞానం, ఎంఎస్ ఆఫీస్ కల్గి ఉన్న అభ్యర్థులు టైపిస్ట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
8వ తరగతి నందు ఉత్తిర్ణత మరియు ఐటీఐ ఫిట్టర్ టెక్నికల్ సర్టిఫికెట్ కలిగి ఉన్న అభ్యర్థులు ఫిట్టర్ బెడ్ ఆపరేటర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
7వ తరగతి విద్యా అర్హతగా కలిగి ఉన్న అభ్యర్థులు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
చదవడం మరియు వ్రాయడం వచ్చిన అభ్యర్థులు స్వీపర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
18-52 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది అడ్రస్ కు తమ తమ దరఖాస్తు ఫారం నకు సంబంధిత విద్యా ధ్రువీకరణ పత్రాలను జతపరచి నిర్ణిత గడువు చివరి తేదిలోగా సమర్పించవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులు లేవు.
ఎలా ఎంపిక చేస్తారు:
డిగ్రీ మార్కుల మెరిట్ మరియు కంప్యూటర్ మెరిట్ ల ఆధారంగా టైపిస్ట్ పోస్టుకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మిగిలిన కేటగిరీల పోస్టులకు అకాడమిక్ మెరిట్, అభ్యర్థుల వయసు, అంగవైకల్యం, ఎంప్లొయ్ మెంట్ సీనియరిటీ ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతములు లభించనున్నాయి.
దరఖాస్తులు పంపించవల్సిన అడ్రస్ ( చిరునామా ) :
సహాయ సంచాలకులు,
విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సంక్షేమశాఖ,
కలెక్టర్ కార్యాలయం ఆవరణ,
మచిలీపట్నం,
కృష్ణా జిల్లా,
ఆంధ్రప్రదేశ్.

0 Comments