మార్చి నెలలో ఇంటర్వ్యూల విషయంలో అటు ఏపీపీఎస్సీ మరియు ఇటు ఏపీ ప్రభుత్వానికి మధ్య జరిగిన తీవ్ర సమాలోచనలు, ఎట్టకేలకు ఇంటర్వ్యూలపై వచ్చిన స్పష్టత, పూర్తి వివరాలను ఇప్పుడే చూడండి, డోంట్ మిస్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఇంటర్వ్యూల నిర్వహణ విషయంలో ఏపీ ప్రభుత్వం ఒక అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది.
భవిష్యత్తు రోజులలో ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించరాదని ఏపీ ప్రభుత్వం ఏపీపీఎస్సీ బోర్డ్ కు ఒక లేఖ ద్వారా స్పష్టంగా తెలిపినట్లుగా మనకు తెలుస్తుంది. APPSC Jobs No Interview
గడిచిన సంవత్సరం 2021 జూన్ 28వ తేదీన ఏపీపీఎస్సీ ద్వారా జరిగే ఉద్యోగాల నియామకాలకు ఇంటర్వ్యూలు ఉండబోవని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమునకు చెందిన సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులను జారీ చేసింది.
ఈ ఉత్తర్వుల జారీ అనంతరం ఏపీ ప్రభుత్వానికి మరియు ఏపీపీఎస్సీ బోర్డుకు మధ్య ఈ ఇంటర్వ్యూల నిర్వహణ విషయంలో అనేకానేకా సమాలోచనలు జరిగినట్లుగా మనకు తెలుస్తుంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా, ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో జరిగే పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించాలని కోరుతూ మార్చి 21, 2022 నాడు ఏపీపీఎస్సీ కార్యదర్శి మరియు ఇతర బోర్డు మెంబర్లు కలసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖకు ఒక ప్రకటన ద్వారా విన్నవించినట్లుగా తెలుస్తుంది.
ఏపీపీఎస్సీ బోర్డు కార్యదర్శి మరియు ఇతర బోర్డు మెంబర్లు ప్రతిపాదించిన విషయాలపై రివ్యూ చేసిన సాధారణ పరిపాలన శాఖ అదనపు కార్యదర్శి మరి కొంత కాలం పాటు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో చేపట్టబోయే పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించరాదని మార్చి 28, 2022 వ తేదీన ఒక లేఖ ద్వారా స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది.
ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో ఏపీపీఎస్సీ ఉద్యోగాల భర్తీలో ఇకపై ఇంటర్వ్యూల నిర్వహణ ఉండదని మనం స్పష్టంగా అర్ధం చేసుకోవచ్చు.

0 Comments