ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న విభిన్న ప్రతిభావంతుల (వికలాంగుల)బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ఈ పోస్టులకు అర్హులైన విభిన్న ప్రతిభావంతుల కేటగిరీలకు చెందిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల భర్తీకి సంబంధించిన విధి - విధానాలను గురించి మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. AP Govt 7th Class Qualification Jobs
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది : మార్చి 31, 2022, (5PM).
విభాగాల వారీగా ఖాళీలు :
జూనియర్ అసిస్టెంట్ - 2
స్టోర్ కీపర్ - 1
జూనియర్ స్టేనో - 1
టైపిస్ట్ - 1
కార్యాలయపు సబ్ ఆర్డినేట్ /అటెండర్ - 1
ఫార్మసీస్ట్ గ్రేడ్ - II - 1
మొత్తం పోస్టులు :
7 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీలు లేదా బోర్డుల నుండి 7వ తరగతి / ఇంటర్మీడియట్ /డీ-ఫార్మసీ /ఏదైనా విభాగాలలో డిగ్రీ కోర్సులు /టైపు రైటింగ్ తెలుగు హయ్యర్ మరియు షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ నందు ఉత్తిర్ణత, తదితర కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
18-52 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆఫ్ లైన్ విధానంలో అభ్యర్థులు సంబంధిత విద్యా దృవీకరణ పత్రాలను జతపరచి ఈ క్రింది చిరునామాకు నిర్ణిత గడువు చివరి తేది లోగా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపవలెను.లేదా వ్యక్తిగతంగా కూడా అందించవచ్చును.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎలా ఎంపిక చేస్తారు..?
విద్యా అర్హతల మార్కులు మరియు మెరిట్ ను అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ఆకర్షణీయమైన జీతం లభించనుంది.
దరఖాస్తులు పంపవల్సిన అడ్రస్ :
సహాయ సంచాలకులు,
విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ,
డీ - బ్లాక్, న్యూ కలెక్టరేట్, కడప, ఆంధ్రప్రదేశ్.
మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాలు Click Here
0 Comments