ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్టణం నగరంలో ఉన్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వారి కార్యాలయంలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నా పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు :
1). ఇవి ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.
2). ఆకర్షణీయమైన వేతనాలు.
3). కాంట్రాక్టు / అవుట్ సోర్సింగ్ విభాగంలో పోస్టుల భర్తీ.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
ఎంపికైన అభ్యర్థులకు వైజాగ్ లో ఉన్న వై. ఎస్. ఆర్ అర్బన్ క్లినిక్స్ లలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
వైజాగ్ నుండి వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది : మార్చి 18, 2022.
విభాగాల వారీగా ఖాళీలు :
స్టాఫ్ నర్స్ - 6
ల్యాబ్ టెక్నీషియన్ - 3
ఫార్మసీస్ట్ - 2
డేటా ఎంట్రీ ఆపరేటర్ - 2
మొత్తం పోస్టులు :
13 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
జీఎన్ఎం/బీ. ఎస్సీ (నర్సింగ్) మరియు అప్డేటెడ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నా అభ్యర్థులు అందరూ స్టాఫ్ నర్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
డీఎంఎల్టీ/ఎంఎల్టీ/బీ. ఎస్సీ (ఎంఎల్టీ) తో అప్డేటెడ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నవారు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
డీ. ఫార్మసీ /బీ. ఫార్మసీ విత్ అప్డేటెడ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ కలిగి ఉన్న అభ్యర్థులు ఫార్మసీస్ట్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఏదైనా విభాగంలో డిగ్రీ కోర్సులను పూర్తి చేసి, మూడు నెలల కంప్యూటర్ కోర్సు సర్టిఫికెట్ ను కలిగి ఉన్న అభ్యర్థులు అందరూ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
ఎటువంటి వయసు పరిమితి నిబంధనలను ఈ ప్రకటనలో పొందుపరచలేదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో వెబ్సైటు నుండి దరఖాస్తు ఫారం ను డౌన్లోడ్ చేసుకుని, దరఖాస్తు ఫారం ను నింపి సంబంధిత విద్యా అర్హతల నకలుల కాపీలను జతపరచి ఈ క్రింది చిరునామా కు నిర్ణిత గడువు చివరి తేదిలోగా అందించవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎలా ఎంపిక చేస్తారు..?
విద్యా అర్హతల మార్కులు మరియు మెరిట్ ను ఆధారంగా చేసుకుని లేదా ఇతర ఎంపిక విధానాలను అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ఆకర్షణీయమైన వేతనాలు లభించనున్నాయి.
దరఖాస్తులు పంపవల్సిన అడ్రస్ :
జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం,
విశాఖపట్టణం, ఆంధ్రప్రదేశ్.
0 Comments