Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AP Govt Employees News : ఏపీ లో రిటైర్మెంట్ వయస్సు పెంపుకు అసెంబ్లీ ఆమోదం, ఏపీ లో ఈ ఉద్యోగులకు గుడ్ న్యూస్

అప్డేట్ 1 : ఇకపై పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ ప్రభుత్వ శాఖలలో వృత్తి బాధ్యతలను నిర్వహిస్తున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సుపై ఒక కీలకమైన ప్రకటన తాజాగా వచ్చింది.

AP Govt Employees News

ఏపీ లో ప్రస్తుతం పని చేస్తున్న గవర్నమెంట్ ఉద్యోగస్తుల పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచుతూ  తీసుకున్న నిర్ణయాన్ని బిల్లు రూపంలో ఏపీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టినది. ఈ బిల్లుకు  ఏపీ శాసనసభ తమ ఏకగ్రీవ ఆమోదంను తెలిపినట్లుగా తెలుస్తుంది.

దీనితో, ఇకపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలుగా మారినది. AP Govt Employees News

అప్డేట్ 2 : ఏపీ లో ఈ ఉద్యోగులకి వరుసగా 5 డీఏ లు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పని చేస్తున్న జ్యూడిషియల్ అధికారులకు వరుసగా ఐదు డీఏ(కరువు భత్యం)లను వర్తింపజేస్తూ ఏపీ ఆర్థిక శాఖ తాజాగా తమ ఉత్తర్వులను జారీ చేసింది.

యూజీసీ 2006 పేస్కేల్ లను అనుసరించి జీతములు పొందుతున్న ఏపీ జ్యూడిషియల్ అధికారులకు జూలై 1, 2019 నుండి జూలై 1, 2021 వరకూ రావాల్సిన ఐదు డీఏలను వర్తింపజేస్తూన్నట్లుగా ఈ ఉత్తర్వులలో ఏపీ ఆర్థిక శాఖ పొందుపరిచినట్లుగా తెలుస్తుంది..

ఏపి లో మరిన్ని ఉద్యోగాల భర్తీ .. Click Here 

Post a Comment

0 Comments