Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Tirupati Data Entry Jobs 2022 : తిరుపతి లో డేటా ఎంట్రీ పోస్టులు, 40,000 రూపాయలు వరకూ జీతం

సుమారుగా 25 సంవత్సరాలు అనుభవం కలిగిన సెక్యూరిటీ మరియు అవుట్ సోర్సింగ్  మ్యాన్ పవర్ కంపెనీ అయినా బీ. ఎస్. ఎఫ్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, భూవనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి మరియు రాజమండ్రిలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

ప్రకటన గురించి మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు  :

ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు  చేరుటకు చివరి తేది  :  ప్రకటన వచ్చిన 10రోజుల లోపు.

విభాగాల వారీగా ఖాళీలు   :

జనరల్ మేనేజర్                   -    2

అసిస్టెంట్ జనరల్ మేనేజర్ -   3

మేనేజర్స్                                -   8

అకౌంటెంట్స్                         -   3

డేటా ఎంట్రీ/డీటీపీ ఆపరేటర్స్ - 8

ఆఫీస్ అసిస్టెంట్స్                 -   3

మొత్తం పోస్టులు  :

27 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

జనరల్ మేనేజర్ పోస్టులకు మాజీ ఆర్మీ, నేవి, ఎయిర్ ఫోర్స్, పోలీస్ అధికారులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టులకు మాజీ పారా మిలిటరీ ఫోర్సస్, పోలీస్ ఉద్యోగులు లేదా ప్రయివేట్ సెక్యూరిటీ అనుభవం గలవారికి ప్రాధాన్యత ఇవ్వబడును.

ఏదైనా డిగ్రీ మరియు కనీస రెండు సంవత్సరాల ఉద్యోగ అనుభవం కలిగిన వారు మేనేజర్స్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

టాలీ, జీఎస్టీ, ఎక్సెల్ పై నాలెడ్జి కలిగి ఉన్న అభ్యర్థులు అకౌంటెంట్స్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, స్పీడ్ టైపింగ్, తెలుగు డీటీపీ తెలిసిన అభ్యర్థులు డేటా ఎంట్రీ /డీటీపీ ఆపరేటర్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

10వ తరగతి లేదా ఆపై విద్యా అర్హతలు కలిగిన అభ్యర్థులు ఆఫీస్ అసిస్టెంట్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు  :

ఎటువంటి వయసు పరిమితి నిబంధనలు లేవు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఆసక్తి గల అభ్యర్థులు తమ తమ పూర్తి బయో డేటా లను ఈ క్రింది అడ్రస్ కు ప్రకటన వచ్చిన నాటి నుండి  10 రోజుల లోపు పోస్ట్ / కొరియర్ ద్వారా పంపవలెను అని ప్రకటనలో తెలిపారు

ఎలా ఎంపిక చేస్తారు..?

అర్హతలు మరియు అనుభవాల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం   :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 8,000 రూపాయలు నుండి 40,000 రూపాయలు వరకూ జీతం మరియు పీఎఫ్ + ఈఎస్ఐ+ఇన్సూరెన్స్ సౌకర్యాలు కూడా లభించనున్నాయి.

దరఖాస్తులు పంపవల్సిన అడ్రస్  :

B. S. F. INDIA PVT. LTD.,

ఉపాధి భవన్, గెయిల్ ఆఫీస్ ఎదురు వీధి, ఎ. వి. అప్పారావు రోడ్, రాజమండ్రి.

ఫోన్ నెంబర్  :

0883-2444458

Email Address  :

mdbsfindiahyd@gmail.com

Notification

Post a Comment

0 Comments