Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AP Group 4 Jobs 2022 : కొత్త నోటిఫికేషన్, ఆంధ్రప్రదేశ్ ఈ జిల్లాలో గ్రూప్ - 4 పోస్టుల భర్తీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వివిధ శాఖలలో విభిన్న ప్రతిభావంతుల (దివ్యాంగుల) కొరకు గ్రూప్ - 4 సర్వీస్ లో కేటాయించబడి భర్తీ కాకుండా మిగిలి ఉన్న బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.

ఈ పోస్టులకు అర్హతలు కలిగిన దివ్యంగులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

5,7,10వ తరగతుల విద్యా అర్హతలతో కూడా ఉద్యోగాలు ఉండడంవల్ల ఈ ప్రకటనను దివ్యంగులకు వచ్చినా ఒక మంచి  అవకాశంగా మనం చెప్పుకోవచ్చు.

AP Group 4 Jobs 2022

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెల్లూరు జిల్లాలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

నెల్లూరు జిల్లా నుండి వచ్చిన ఈ ప్రకటన గురించి మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. AP Group 4 Jobs 2022

ముఖ్యమైన తేదీలు  :

ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది  : ఏప్రిల్  1, 2022  (5PM).

విభాగాల వారీగా ఖాళీలు   :

గ్రూప్ - 4 సర్వీసెస్ పోస్టులు  :

పోస్ట్ లు ఖాళీలు
జూనియర్ అసిస్టెంట్ 1
టైపిస్ట్ 3

సాంకేతిక విభాగపు పోస్టులు :

పోస్ట్ లు ఖాళీలు
డార్క్ రూమ్ అసిస్టెంట్ 1
టెక్నికల్ అసిస్టెంట్ 1
టెక్నికల్ అసిస్టెంట్ 1

నాల్గవ తరగతి సర్వీసెస్ పోస్టులు  :

పోస్ట్ లు ఖాళీలు
ఆఫీస్ సబ్ఆర్డినేట్ 4
వాచ్ మెన్ /డే వాచర్ 1
పీ. హెచ్. వర్కర్ 4
అవెన్యూ కూలి 1
కాపలాదారు 1
గార్డెనర్ ( తోటమాలి ) 1
ఫౌంటైన్ క్లీనర్ 1

మొత్తం పోస్టులు :

20 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

5వ తరగతి /7వ తరగతి/10వ తరగతి/ఐటిఐ(డ్రాఫ్ట్స్ మెన్ సివిల్ /మెకానికల్ ) /డార్క్ రూమ్ అసిస్టెంట్ /క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్/డిగ్రీ తదితర కోర్స్ లను పూర్తి చేసి, ఇంగ్లీష్ మరియు తెలుగు భాషలయందు టైప్ హయ్యార్ గ్రేడ్ /కంప్యూటర్ ఆటోమేషన్ లపై నాలెడ్జ్ ను కలిగి ఉన్న అభ్యర్థులు అందరూ విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రకటనలో తెలిపారు.

వయసు :

18-52 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పొస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఆఫ్ లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.

ఈ క్రింది అడ్రస్ కు అభ్యర్థులు తమ తమ దరఖాస్తు ఫారంలకు సంబంధిత విద్యా ధ్రువీకరణ పత్రాలను జతపరచి నిర్ణిత గడువు చివరి తేది లోగా పోస్టల్ ద్వారా పంపవచ్చును లేదా స్వయంగా అందించవచ్చును.

దరఖాస్తు ఫీజు  :

ఎటువంటి దరఖాస్తు ఫీజులు లేవు.

ఎలా ఎంపిక చేస్తారు:

విద్యా అర్హతల మార్కులు మెరిట్ ను అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

గ్రూప్ 4  సర్వీస్ పోస్టులకు  కంప్యూటర్ ఆటోమేషన్ పరీక్షను నిర్వహించనున్నట్లుగా ప్రకటనలో తెలిపారు.

జీతం   :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షనీయమైన వేతనాలు లభించనున్నాయి.

దరఖాస్తులు పంపవల్సిన అడ్రస్  :

విభిన్న ప్రతిభా వంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.

Website

Notification

Post a Comment

0 Comments