Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AP Jobs Calendar 2022 : ఆంధ్రప్రదేశ్ లో ఉగాది జాబ్ క్యాలెండరు విడుదల..? నిజమేంత..?

ఏపీ లో గ్రూప్ 4 మరియు ఎండో మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులకు పరీక్షలను ఏ నెలలో నిర్వహించనున్నారు..? సమగ్ర విశ్లేషణ మీకోసం. వెంటనే చదవండి.

అప్డేట్  1 : ఉగాది జాబ్ క్యాలెండరు..! నిజమెంతా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన కొన్ని రోజుల నుండి 2022 వ సంవత్సరం ఉగాది రోజున ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో భాగంగా నూతన జాబ్ క్యాలెండరు విడుదల చేయనుంది అని ఒక వార్త సామాజిక మాధ్యమాల వేదికగా తెగ హల్చల్ చేస్తుంది.

AP Jobs Calendar 2022

అయితే, ఉగాది నాడు అనగా ఏప్రిల్ 2, 2022 నాడు ఏపీ  రాష్ట్రంలో  జాబ్ క్యాలెండరు విడుదల విడుదల పై వస్తున్న వార్తలు నిజామా..? కాదా..? అనే విషయంపై మనం ఇప్పుడు ఒక్కసారి విశ్లేషణ చేద్దాం. AP Jobs Calendar 2022

ఏపీ లో గడిచిన కొన్ని నెలల క్రితం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల  సంఖ్యను పంపమని అధికారులను ఆదేశించింది. గడువు తేది లోగా అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి శాఖల వారీగా ఉద్యోగాల ఖాళీలను పంపినట్లుగా అధికారికంగా కొంత మంది ప్రభుత్వ విభాగాలలో పనిచేసే మిత్రుల ద్వారా మనకు తెలుస్తుంది.

సరిగ్గా ఈ తరుణంలోనే ప్రభుత్వానికి సంబంధించిన ఒక ప్రముఖ వార్త పత్రిక లో గత జాబ్ క్యాలెండరు లో విడుదల చేసిన జాబ్ క్యాలెండరు లో ప్రకటించిన గ్రూప్ 1 మరియూ గ్రూప్ 2 పోస్టులను పెంచడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేస్తుందని ఒక వార్తను ప్రచురించడం జరిగింది.

మరోవైపు రాష్ట్రానికి చెందిన ప్రముఖ మంత్రివర్యులు ఏపీ గ్రామ మరియు వార్డు సచివాలయాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేయనున్నాట్లు ఒక మీడియా సమావేశంలో ప్రకటిస్తే, మరో వైపు ఏపీ హోం శాఖ మంత్రివర్యులు త్వరలోనే ఏపీ లో ఖాళీగా ఉన్న పోలీస్ మరియు కానిస్టేబుల్ పోస్టుల భర్తీని త్వరలోనే చేపడతామని మరొక సమావేశంలో తెలియచేశారు.

జరుగుతున్న పరిణామాల దృష్ట్యా, ఏపీ లో నిరుద్యోగులలో ప్రభుత్వం గతంలో విడుదల చేసిన జాబ్ క్యాలెండరు పై  నెలకొని ఉన్న నిరాశ మరియు నిస్పృహల దృష్ట్యా ప్రస్తుతం ప్రచారం అవుతున్న విషయం ఉగాది నాడు జాబ్ క్యాలెండరు విడుదల కానున్నది అనే విషయం నమ్మదగిన వార్త అని మనం చెప్పుకోవచ్చు.

ఈ జాబ్ క్యాలెండరు లో ఖచ్చితంగా పెరిగిన గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 పోస్టులు, గ్రామ మరియు వార్డు సచివాలయం,పోలీస్ /ఎస్ఐ పోస్టుల భర్తీ కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఉండనున్నట్లుగా అనధికారిక సమాచారం అందుతుంది.

ఏది ఏమైనా రాబోయేది ఎన్నికల కాలం కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రాలలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్స్ విడుదల కావడం తథ్యం. కావున, అభ్యర్థులు మీ మీ ప్రిపరేషన్స్ ను పక్కకు పెట్టకుండా, కొనసాగించడం మంచిది అని మనం అనుకోవచ్చు.

అప్డేట్ 2  :   ఏపీ లో గ్రూప్ 4 మరియు ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పరీక్షలు ఏ నెలలో జరుగుతాయి..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన ఏడాది 2021 డిసెంబర్ నెలలో ఏపీ రెవిన్యూ డిపార్టుమెంటు లో ఖాళీగా ఉన్న 670 కంప్యూటర్ కమ్ రెవిన్యూ అసిస్టెంట్ ( గ్రూప్ - 4 ) పోస్టులకు మరియు 60 దేవాదాయ ధర్మదాయ శాఖకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ( గ్రేడ్ - 3 ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల అయిన సంగతి మనకు తెలిసిందే.

అయితే, ఈ 730 పోస్టుల భర్తీకి  నోటిఫికేషన్స్ విడుదల అయ్యి రెండు నెలలు గడుస్తున్న, ఇంకా ఆయా పరీక్షల నిర్వహణ తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు.

మనకు అందుతున్న అనధికారిక విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఏపీ లో త్వరలో భర్తీ కానున్న ఈ గ్రూప్ - 4 మరియు ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ - 3 పోస్టులకు నిర్వహించే ప్రిలిమ్స్ పరీక్షలను ఏపీ లో త్వరలో జరుగబోయే 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ అనంతరం మే /జూన్ నెలల్లో నిర్వహించనున్నట్లుగా తెలుస్తుంది. 

ఒకవేళ ఏదైనా కారణాల వల్ల ఏప్రిల్ నెల 15 వ దాటిన తరువాత కూడా ఈ పరీక్షల నిర్వహణ జరిగిన మనం ఆశ్చర్యం వ్యక్తం చేయనవసరం లేదు. కావున, ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మీ మీ పరీక్షల ప్రిపరేషన్ వేగాన్ని మరింత పెంచుతారని మన వెబ్సైటు ద్వారా ఆశిస్తున్నాము. 

ఆంధ్రప్రదేశ్ లో మరిన్ని ఉద్యోగాల కొరకు Click Here 

Post a Comment

0 Comments