Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Bank of Baroda Jobs Recruitment 2022 : బ్యాంక్ ఆఫ్ బరోడా లో ఉద్యోగాలు, జీతం 48,170

ప్రముఖ బ్యాంక్ ఆఫ్ బరోడా కు చెందిన ఫ్రాడ్ రిస్క్ మేనేజ్ మెంట్, ఎంఎస్ఎంఈ & కార్పొరేట్ క్రెడిట్ డిపార్టుమెంట్స్ కు చెందిన వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల అయినది.

ముఖ్యంశాలు  :

1). ఇవి రెగ్యులర్ బేసిస్ పోస్టులు.

2). ఇరు తెలుగు రాష్ట్రముల వారు అప్లై చేసుకోవచ్చు.

3). భారీ స్థాయిలో వేతనాలు.

Bank of Baroda Jobs Recruitment 2022

ఈ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు Bank of Baroda Jobs Recruitment 2022

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి వచ్చిన ఈ నోటిఫికేషన్ లో పొందుపరిచిన అతి ముఖ్యమైన అంశాలను గురించి మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు  :

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది    :   మార్చి 24, 2022.

విభాగాల వారీగా ఖాళీలు :

మేనేజర్ - డిజిటల్ ఫ్రాడ్ (ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్ )  -    15

క్రెడిట్ ఆఫీసర్ ( ఎంఎస్ఎంఈ డిపార్టుమెంటు )       -    40

క్రెడిట్ - ఎక్స్పోర్ట్ /ఇంపోర్ట్ బిజినెస్ (ఎంఎస్ఎంఈ)    -   20

ఫారెస్ యాకక్విసిషన్ &రిలేషన్ షిప్ మేనేజర్       -    15

కార్పొరేట్ క్రెడిట్ డిపార్టుమెంటు                           -     15

మొత్తం పోస్టులు :

105 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

 గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ ల నుండి సంబంధిత సబ్జెక్టు విభాగాలలో అనగా కంప్యూటర్ సైన్స్ /ఐటీ/డేటా సైన్స్ లలో బీఈ/బీ. టెక్/గ్రాడ్యుయేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ /ఐటీ /బీ. ఎస్సీ /బీసీఏ/ఎంసీఏ/పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ/డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ విత్ స్పెషలైజెషన్ ఇన్ ఫైనాన్స్ /బ్యాంకింగ్/ఫారెస్/క్రెడిట్/సీఏ/సీఎంఏ/సీఎఫ్ఏ/ఏదైనా విభాగాలలో గ్రాడ్యుయేషన్/పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ /డిప్లొమా విత్ స్పెషలైజెషన్ ఇన్ మార్కెటింగ్/సేల్స్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు సంబంధిత సబ్జెక్టు విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

వయసు :

24 నుండి 40 సంవత్సరాలు వయసు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పొస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

బ్యాంక్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యంగులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి :

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు  :

జనరల్/ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 600 రూపాయలు మరియు మిగిలిన కేటగిరీ అభ్యర్థులు 100 రూపాయలును దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.

ఎలా ఎంపిక చేస్తారు..?

ఆన్లైన్ టెస్ట్ /గ్రూప్ డిస్కషన్ /ఇంటర్వ్యూ విధానముల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

ఆన్లైన్ పరీక్ష నిర్వహణ - ముఖ్య వివరాలు  :

ఆన్లైన్ టెస్ట్ లో రీసనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటెటివ్ అప్టిట్యూడ్, ప్రోఫెషనల్ నాలెడ్జ్ అంశాలకు సంబంధించిన 150 ప్రశ్నలను అభ్యర్థులను అడుగనున్నారు.

మొత్తం 225 మార్కులకు పరీక్ష నిర్వహణ ఉండగా, కాలవ్యవధి 150 నిముషాలను ఇవ్వనున్నట్లుగా ప్రకటనలో పొందుపరిచారు.

జీతం :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 48,170 రూపాయలు నుండి 89,890రూపాయలు వరకూ జీతం అందనుంది.

ఈ జీతంతో పాటు డీఏ+స్పెషల్ అలోవెన్స్+హెచ్ఆర్ఏ+సీసీఏ+మెడికల్ తదితర అద్భుతమైన బెనిఫిట్స్ కూడా ఉద్యోగార్థులకు లభించనున్నాయి.

పరీక్ష కేంద్రముల నగరాలు - ఎంపిక  :

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది నగరాలను పరీక్ష కేంద్రములుగా ఎంపిక చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్   :   విశాఖపట్నం

తెలంగాణ    :   హైదరాబాద్

Apply Link

Notification

More Bank Jobs Click Here


Post a Comment

0 Comments