తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్ ) - 2022 కు సంబంధించిన నోటిఫికేషన్ మార్చి నెల ఆఖరికి లేదా ఏప్రిల్ నెలలో విడుదల కానున్నట్లు అధికారికంగా సమాచారం అందుతుంది.
తాజాగా తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET)- 2022 నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలను రూపొంధించిన పాఠశాల విద్యా శాఖ, ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక అందించినట్లుగా తెలుస్తుంది.
ఈ నెల మార్చి 2వ తేదీన జరిగిన విద్యారంగంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీలో భాగంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) - 2022 ను నిర్వహించడానికి ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. AP TET Notification 2022
ఈ నేపథ్యంలోనే మార్చి నెలాఖరులో గానీ లేదా ఏప్రిల్ నెలలో గానీ టెట్ - 2022 నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తుంది.
కాగా, చివరిసారిగా 2017వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో టెట్ పరీక్షలను నిర్వహించారు.
గత నాలుగు సంవత్సరాలు నుండి తెలంగాణ రాష్ట్రంలో టెట్ నోటిఫికేషన్ విడుదల కాలేని కారణంగా, సుమారుగా 4నుండి 5 లక్షల మందికి పైగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ ) - 2022 నోటిఫికేషన్ గురించి ఆసక్తిగా, ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నారు.
తెలంగాణ లో మరిన్ని ఉద్యోగాల కొరకు Click Here
0 Comments