ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ విభాగాలలో ఖాళీగా ఉన్న గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 పోస్టుల భర్తీకి అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నుండి నోటిఫికేషన్స్ విడుదల చేయనున్నట్లు తాజాగా ఒక ప్రకటన ద్వారా తెలుస్తుంది.
గత సంవత్సరం విడుదల చేసిన ఏపీ జాబ్ క్యాలెండరు లో పొందుపరిచిన 36 గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఉద్యోగాల సంఖ్యను భారీగా 292 కు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు తాజాగా ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఏపీ సీఎం గారు తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ భారీ సంఖ్యలో గల గ్రూప్స్ పోస్టులలో గ్రూప్ 1 కు సంబంధించినవి 110 మరియు గ్రూప్ 2 కు సంబంధించిన పోస్టులు 182 ఉన్నాయి.
విభాగాల వారీగా ఉన్న గ్రూప్ 1 & గ్రూప్ 2 ఉద్యోగాల వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రూప్ 1 పోస్టులు :
డిప్యూటీ కలెక్టర్లు - 10
రోడ్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్లు (ఆర్డిఓ) - 7
కమర్షియల్ టాక్స్ ఆఫీసర్స్ (సీటీఓ ) - 12
జిల్లా రిజిస్టర్స్ ( స్టాంప్స్ & రిజిస్ట్రేషన్స్) - 6
జిల్లా గిరిజన సంక్షేమ అధికారి - 1
జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి - 1
జిల్లా బీసీ సంక్షేమ అధికారి - 3
డిఎస్పీ (సివిల్ ) - 13
డిఎస్పీ (జైళ్లు /పురుషులు ) - 2
జిల్లా అగ్నిమాపక అధికారి (డిఎఫ్ఓ ) - 2
అసిస్టెంట్ లేబర్ కమిషనర్ - 3
మున్సిపల్ కమిషనర్ - 1
మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్ - 2) - 8
డిప్యూటీ రిజిస్టర్ (కోపరేటివ్ డిపార్టుమెంటు ) - 2
లే సెక్రటరీ అండ్ ట్రేజరర్ గ్రేడ్ - 2 - 5
ఏటీఓ/ఏఏఓ(ట్రేజరీస్ డిపార్టుమెంటు ) - 8
ఏఏఓ(డిఎస్ఏ)(స్టేట్ అడిట్ డిపార్టుమెంటు ) - 4
ఏఓ(డైరెక్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ) - 15
ఎంపీడిఓ - 7
గ్రూప్ 2 పోస్టులు :
డిప్యూటీ తహసీల్దార్ - 30
సబ్ రిజిస్టర్ గ్రేడ్ - 2 - 16
అసిస్టెంట్ రిజిస్టర్, కోపరేటివ్ - 15
మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్ - 3) - 5
ఏఎల్ఓ (లేబర్ ) - 10
ఏఎస్ఓ (లా ) - 2
ఏఎస్ఓ(లేజిస్లీచర్ ) - 4
ఏఎస్ఓ(సాధారణ పరిపాలన ) - 50
జేఏ(సీసీఎస్ ) - 5
సీనియర్ అకౌంటెంట్ (ట్రేజరీ ) - 10
జూనియర్ అకౌంటెంట్ (ట్రేజరీ ) - 20
సీనియర్ ఆడిటర్ (స్టేట్ అడిట్ డిపార్టుమెంటు ) - 5
ఆడిటర్ ( పే అండ్ అలోవెన్స్ డిపార్టుమెంటు ) - 10
మొత్తం పోస్టులు :
182 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి తాజాగా ఏపీ సీఎం ఓకే చెప్పారు.
గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 పోస్టులు మొత్తం 110+182 కలిపి 292 పోస్టుల భర్తీకి అతి త్వరలోనే ఏపీ లో నోటిఫికెషన్స్ విడుదల కానున్నాయి.
నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు ఈ సైట్ లో చూడవలసి ఉంటుంది. Click Here
0 Comments