సౌత్ ఇండియా లో మల్టీ స్టేట్ షెడ్యూల్డ్ కో- ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు గా పిలువబడే ఆంధ్రప్రదేశ్ మహేష్ కో.ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న క్లర్క్ కమ్ క్యాషియర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
200 క్లర్క్ కమ్ క్యాషియర్ ఉద్యోగాలు, జీతం 22,934 రూపాయలు, ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే, పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యాంశాలు :
1).ఇవి అర్బన్ బ్యాంక్ కు సంబంధించిన పోస్టులు.
2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే.
3). గౌరవస్థాయిలో వేతనాలు.
4). ఒక సంవత్సరం ప్రోబేషన్ పీరియడ్ విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం ఈ పోస్టులను రెగ్యులర్ చేస్తారు.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో తెలిపారు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర మరియు రాజస్థాన్ రాష్ట్రాలలో పోస్టింగ్స్ ను కల్పించే అవకాశాలు ఉన్నాయి.
హైదరాబాద్ బ్యాంకు నుండి వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. Mahesh Co Operative Bank Jobs 2022
ముఖ్యమైన తేదీలు :
పరీక్ష ఫీజు & ఆన్లైన్ ఇమెయిల్ దరఖాస్తులకు చివరి తేది : మార్చి 27, 2022.
విభాగాల వారీగా ఖాళీలు :
క్లర్క్ కమ్ క్యాషియర్స్ - 200
మొత్తం పోస్టులు :
200 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుండి ఏదైనా విభాగాలలో గ్రాడ్యుయేషన్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కంప్యూటర్ నాలెడ్జ్, గుడ్ కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్ మరియు ఇతర లోకల్ భాషలపై నాలెడ్జ్ ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వనడుతుంది అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
ఎం. ఎస్. ఆఫీస్ మరియు ఇంటర్నెట్ యూసేజ్ పై నాలెడ్జ్ ఉండవలెను అని తెలుపుతున్నారు.
వయసు :
21-28 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ ఇమెయిల్ విధానంలో అభ్యర్థులు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
500 రూపాయలను అభ్యర్థులు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎలా ఎంపిక చేస్తారు..?
వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ విధానాలను అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
పరీక్ష సిలబస్ - వివరాలు :
టెస్ట్ ఆఫ్ రీసనింగ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, ఇంగ్లీష్ మరియు కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ అంశాలను గురించి అభ్యర్థులను పరీక్షలలో ప్రశ్నించనున్నారు.
మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహాణ ఉండగా, పరీక్ష కాలవ్యవధి 2 గంటల సమయం గా ఉండనుంది.
ఇంగ్లీష్ భాషలో డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్ కు మరో 30 నిమిషాల సమయంను అభ్యర్థులకు కేటాయించడం జరిగింది.
పరీక్ష కేంద్రం :
ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు పరీక్షలను తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో నిర్వహించనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 23,934 రూపాయలు వరకూ జీతంగా అందనుంది.
దరఖాస్తులు పంపవల్సిన ఈ మెయిల్ అడ్రస్ :
Email :
clerk2022@apmaheshbank.com
0 Comments