భారత దేశ వ్యాప్తంగా లక్షలాది అభ్యర్థులు గడిచిన కొన్ని నెలల నుండి ఎదురు చూస్తున్న రైల్వే ఎన్టీపీసీ పరీక్షల రీవైస్డ్ ఫలితాలను భారతీయ రైల్వే బోర్డు తాజాగా విడుదల చేసింది.
తాజాగా సికింద్రాబాద్ రైల్వే జోన్ కు సంబంధించిన పరీక్ష ఫలితాలు అభ్యర్థులకు అందుబాటులోనికి రాగా, రేపటి లోగా దేశంలో ఉన్న అన్ని రైల్వే జోన్ లకు సంబంధించిన పరీక్ష ఫలితాలు అందుబాటులోనికి రానున్నాయి.
తాజాగా విడుదల చేసిన ఈ రిజల్ట్స్ ద్వారా కట్ ఆఫ్ మార్కులు 5 నుండి 6 మార్కుల వరకూ తగ్గినట్లుగా తెలుస్తుంది. Railway NTPC Result 2022
రైల్వే ఎన్టీపీసీ పరీక్షలకు సంబంధించిన రీవైస్డ్ రిజల్ట్స్ మరియు స్కోర్ కార్డు లను రైల్వే జోన్ ల అధికారిక వెబ్సైటులలో పొందుపరిచినట్లుగా తెలుస్తుంది.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ఈ క్రింది వెబ్సైటు నుండి తమ తమ రైల్వే ఎన్టీపీసీ పరీక్షల ఫలితాలను సరిచూసుకోవచ్చు.
రైల్వే లో మరెన్నో ఉద్యోగాలు Click Here

0 Comments