ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ (APSRTC) లో 1852 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన ను ఏపీ రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రివర్యులు తాజాగా మీడియా వేదికగా తెలిపారు.
ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల ప్రకారం ఆర్టీసీలో 1852 కారుణ్య నియామకాలను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా మంత్రి తాజాగా ఈ ప్రకటనలో భాగంగా తెలిపారు.
2016 వ సంవత్సరం నుండి ఆర్టీసీ లో వృత్తి బాధ్యతలను నిర్వహిస్తూ మరణించిన 896 మంది ఉద్యోగుల కుటుంబ సభ్యులుకు, మరియు 2020 వ సంవత్సరం నుండి వృత్తి బాధ్యతలను నిర్వహిస్తూ మరణించిన 956 మంది ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు మొత్తంగా 1852 మంది ఆర్టీసీ లో పనిచేస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులను కారుణ్య నియామకాల క్రింద ఉద్యోగాలను కల్పిస్తున్నట్లుగా మంత్రి తెలిపారు.
ఈ 1852 మందిని కారుణ్య నియామకాలలో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ తో పాటుగా గ్రామ, వార్డు సచివాలయలలో మరియు జిల్లా కలెక్టరేట్ పరిధిలో 40 శాఖలలో భర్తీ చేయనున్నామని,
ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేశామని మంత్రివర్యులు ఈ ప్రకటన ద్వారా స్పష్టం చేశారు. APSRTC 1852 Jobs New Update
మరోవైపు, కోవిడ్ - 19 కారణంగా నిలిపివేసిన సీనియర్ సిటిజెన్ల రాయితీ టికెట్లను ఏప్రిల్ 1, 2022 నుండి తిరిగి ప్రారంభం చేయనున్నట్లు,60 సంవత్సరాలు పైబడిన వయస్సు కలిగిన వారు ఆర్టీసీ బస్ లో ప్రయాణించేటపుడు తమ తమ గుర్తింపు కార్డులను చూపించి బస్ టికెట్స్ ధరలపై 25% శాతం రాయితీ పొందవచ్చునని ఈ ప్రకటనలో మంత్రివర్యులు మరియు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ తెలిపారు.
మరిన్ని ఉద్యోగాల కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి Click Here
0 Comments