భారత కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు మరియు విభాగాల పరిధిలో కలిపి ప్రస్తుతం 8,72,243 పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా బుధవారం నాడు లోక్ సభ వేదికగా గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా భారత కేంద్రప్రభుత్వ సిబ్బంది వ్యవహారాల మరియు శిక్షణశాఖ మంత్రివర్యులు తెలిపారు.
77 మంత్రిత్వ శాఖలు మరియు విభాగాల పరిధిలో 40,04,941 పోస్టులు మంజూరు కాగా, ప్రస్తుతం ఇందులో 31,32,698 మంది పని చేస్తున్నారని మంత్రివర్యులు తెలిపారు.
అయితే, ఈ ఖాళీలలో రక్షణ శాఖలో (సివిల్) లో 6,33,139 పోస్టులు ఉండగా కేవలం 3,85,637 మంది మాత్రమే వృత్తి బాధ్యతలను చేపడుతున్నారని మంత్రివర్యులు తెలిపారు.
ఈ ప్రకటనలో పొందుపరిచిన విభాగాల వారీగా ఉన్న ఖాళీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
రక్షణ శాఖ (సివిల్ విభాగం) - 2,47,502
హోం శాఖ - 1,28,842
పోస్టల్ డిపార్టుమెంటు - 90,050
రెవిన్యూ విభాగం - 76,327
ఇలా వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు అన్ని కలుపుకుని ప్రస్తుతం 8,72,243 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖమంత్రివర్యులు పార్లమెంట్ వేదికగా తాజాగా జరుగుతున్న లోక్ సభ సమావేశాలలో ఒక స్పష్టమైన ప్రకటన ద్వారా తెలిపారు.
మరిన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కొరకు క్లిక్ చెయ్యండి Click Here
0 Comments