ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ (APSRTC) లో వృత్తి బాధ్యతలను చేపడుతున్న ఉద్యోగస్తులకూ సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ తాజాగా వచ్చినది.
గడిచిన 2020 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీ విలీనం కావడంతో ఆర్టీసీ లో పనిచేసే ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులుగానే పరిగణిస్తున్న తరుణంలో ఆర్టీసీ లో వృత్తి బాధ్యతలను చేపడుతున్న ఉద్యోగస్తులకు ఇచ్చే జీతములు,
కేటగిరీల అలోవెన్స్ లు, పెన్షన్, రిటైర్ మెంట్ అనంతరం ఇచ్చే బెనిఫిట్స్ తదితర అంశాలపై అసుతోష్ మిశ్రా కమిటీ కీలకమైన సిఫార్స్ లను చేసినట్లుగా తెలుస్తుంది.
ఈ కమిటీ చేసిన సిఫార్సులలో ముఖ్యమైన విషయాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
ఏపీఎస్ఆర్టీసీ లో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు ప్రభుత్వంలో ఉండే 32 గ్రేడ్లు,83 దశల ప్రకారం సవరించిన పే స్కేల్ ప్రకారం వేతనాలు అందించాలి. APSRTC Update 2022
ఆర్టీసీ లో ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులను ఆరేళ్ళకూ ఒకసారి కల్పించాలి.
ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే విధంగానే ఆర్టీసీ ఉద్యోగస్తులకు కూడా హౌస్ రెంటింగ్ అలోవెన్స్(హెచ్. ఆర్. ఏ ), సీసీఏ తదితర బెనిఫిట్స్ ను అందించాలి.
గవర్నమెంట్ ఉద్యోగస్తుల మాదిరే లీవ్స్ బెనిఫిట్స్, అడ్వాన్స్, వైద్య సౌకర్యాలు మరియు సదుపాయాలు, కారుణ్య నియామకాలు, భీమా కవరేజ్, ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీం తదితర బెనిఫిట్స్ ను కల్పించాలి.
పెన్షన్ స్కీమ్స్ ను ఎంపిక చేసుకునే అవకాశాలు ఆర్టీసీ లో వృత్తి బాధ్యతలు నిర్వహించే ఉద్యోగస్తులకు కల్పించాలి.
ఇలా పలు రకాల సిఫార్స్ లను కమిటీ ఏపీఎస్ఆర్టీసీ లో ఉన్న ఉద్యోగస్తుల కొరకు చేయడం జరిగింది.
AP లో మరిన్ని ఉద్యోగాల కొరకు క్లిక్ చెయ్యండి. Click Here
0 Comments