రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కు చెందిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం, లెర్నింగ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న అప్ప్రెంటీస్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా జారీ అయింది.
ముఖ్యాంశాలు :
1). ఒక సంవత్సరం అప్ప్రెంటీస్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు.
2). ఈ అప్ప్రెంటీస్ ట్రైనింగ్ భవిష్యత్తు లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది.
ఎటువంటి పరీక్షలు లేకుండా భర్తీ చేసే ఈ అప్ప్రెంటీస్ ట్రైనింగ్ లకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో భర్తీ చేయబోయే ఈ అప్ప్రెంటీస్ పోస్టుల భర్తీకి సంబంధించిన ముఖ్యమైన విధి - విధానాలను గురించి సవివరంగా మనం ఇపుడు తెలుసుకుందాం. Vizag Steel Plant 206 Vacancies
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ అప్లికేషన్స్ కు చివరి తేది : మార్చి 10, 2022.
విభాగాల వారీగా ఖాళీలు :
ఇంజనీరింగ్ అప్ప్రెంటీస్ - 173
డిప్లొమా అప్ప్రెంటీస్ - 33
అప్ప్రెంటీస్ షిప్స్ ను అందించే బ్రాంచ్ లు :
ఇంజనీరింగ్ :
మెకానికల్ /ఎలక్ట్రికల్ &ఎలక్ట్రానిక్స్ /ఎలక్ట్రానిక్స్ &కమ్యూనికేషన్స్/ కంప్యూటర్ సైన్స్ /ఐటీ /మెటలార్జి /ఇన్స్ట్రుమెంటేషన్ /సివిల్/కెమికల్.
డిప్లొమా :
మెకానికల్ / ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ /ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ /కంప్యూటర్ సైన్స్ /సివిల్.
మొత్తం పోస్టులు :
తాజాగా వచ్చిన ఈ ప్రకటన ద్వారా మొత్తం 206 అప్ప్రెంటీస్ షిప్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ ల నుండి సంబంధిత విభాగాల సబ్జెక్టులలో డిప్లొమా /ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సులను పూర్తి చేయవలెను.
పై కోర్సులను 2019/2020/2021 అకాడమిక్ ఇయర్స్ లో పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవలెను అనీ ఈ ప్రకటనలో పొందుపరిచారు.
మరియు ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి అంటే తప్పనిసరిగా MHRD NATS పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండవలెను అనీ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
ఎటువంటి వయసు పరిమితి నిబంధనలను ఈ ప్రకటనలో పొందుపరచలేదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ అప్ప్రెంటీస్ షిప్ ట్రైనింగ్ కు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
ఎటువంటి పరీక్షల నిర్వహణ లేకుండా, కేవలం పర్సనల్ ఇంటర్వ్యూ ల, విద్యా అర్హతల మార్కుల పెర్సెంటేజ్ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
స్టై ఫండ్ :
విభాగాలను అనుసరించి ఈ అప్ప్రెంటీస్ షిప్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు అప్ప్రెంటీస్ షిప్ రూల్స్ ప్రకారం ఈ క్రింది స్టై ఫండ్స్ లభించనున్నాయి.
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అప్ప్రెంటీస్ కు నెలకు 9,000 రూపాయలు మరియు డిప్లొమా ఇంజనీరింగ్ అప్ప్రెంటీస్ కు 8,000 రూపాయలు స్టై ఫండ్ లభించనున్నాయి.
వైజాగ్ లో మరెన్నో ఉద్యోగాలు Click Here
0 Comments