హై కోర్ట్ ఆఫ్ తెలంగాణ, హైదరాబాద్ నుండి తెలంగాణ జ్యూడిషల్ మినిస్టరియల్ సర్వీస్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 591 పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా జారీ అయినది.
ముఖ్యాంశాలు:
1). ఇవి రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పోస్టులు.
2). ఇవి రెగ్యులర్ పోస్టులు.
3). భారీ సంఖ్యలో పోస్టుల భర్తీ.
4). భారీ స్థాయిలో వేతనాలు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాలకు సంబంధించిన కోర్ట్ లలో భర్తీ చేసే ఈ పోస్టులకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తులు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ లలో పోస్టింగ్స్ లను కల్పించనున్నారు.
హై కోర్ట్ ఆఫ్ తెలంగాణ నుండి వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన అంశాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : మార్చి 3, 2022
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : ఏప్రిల్ 4, 2022
విభాగాల వారీగా ఖాళీలు :
పోస్ట్ లు | ఖాళీలు |
---|---|
స్టేనో గ్రాఫర్ | 64 |
జూనియర్ అసిస్టెంట్ | 173 |
టైపిస్ట్ | 104 |
ఫీల్డ్ అసిస్టెంట్ | 39 |
ఎగ్జామినర్ | 42 |
కాపీయిస్ట్ | 72 |
రికార్డు అసిస్టెంట్ | 34 |
ప్రాసెస్ సర్వర్ | 63 |
మొత్తం ఖాళీలు :
591 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుండి గ్రాడ్యుయేషన్ కోర్సులను మరియు తెలంగాణ గవర్నమెంట్ టెక్నికల్ ఎక్సమినేషన్ ఇన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ అర్హతలు కలిగి ఉన్న అభ్యర్థులు స్టేనో గ్రాఫర్ - III పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
బాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి మరియు కంప్యూటర్ ఆపరేషన్ లో నాలెడ్జ్ ఉన్న అభ్యర్థులు అందరూ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
టైపిస్ట్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుండి బాచిలర్ డిగ్రీ కోర్సులు మరియు తెలంగాణ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్, కంప్యూటర్ ఆపరేషన్ పై నాలెడ్జ్ కలిగి ఉండవలెను.
ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుండి గ్రాడ్యుయేషన్ మరియు హయ్యర్ టెక్నికల్ క్వాలిఫీకేషన్స్ కలిగి ఉండవలెను.
ఎగ్జామినర్ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే అభ్యర్థులు ఇంటర్మీడియట్ ను పూర్తి చేసి హయ్యర్ అకాడమిక్ మరియు టెక్నికల్ క్వాలీఫీకేషన్స్ కోర్సులను పూర్తి చేసి ఉండవలెను.
కాపీయిస్ట్ పోస్టులకు అప్లై చేయాలంటే అభ్యర్థులు ఇంటర్మీడియట్ ను పూర్తి చేసి, తెలంగాణ గవర్నమెంట్ టెక్నికల్ ఎక్సమినేషన్, ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ క్వాలిఫీకేషన్స్ కలిగి ఉండవలెను.
గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుండి ఇంటర్ మరియు ఉన్నత టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అర్హతలుగా కలిగి ఉన్న అభ్యర్థులు అందరూ రికార్డు అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రాసెస్ సర్వర్ పోస్టులకు అప్లై చేయాలంటే అభ్యర్థులు స్టేట్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నుండి పదవ తరగతి ని పూర్తి చేసి, హయ్యర్ అకాడమిక్ మరియు టెక్నికల్ క్వాలిఫీకేషన్స్ కలిగి ఉండాలని ఈ ప్రకటనలో తెలిపారు.
వయసు :
18 - 34 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ/ఎస్టీ/బీసీ/ews కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు దివ్యంగులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
ఓసీ మరియు బీసీ కేటగిరీ అభ్యర్థులు 800 రూపాయలు మరియు ఎస్సీ/ఎస్టీ/ews కేటగిరీ అభ్యర్థులు 400 రూపాయలను దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎలా ఎంపిక చేస్తారు..?
ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ మరియు ఇంటర్వ్యూ (వైవ - వాయిస్ ) నిర్వహణల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ ఇంగ్లీష్ తదితర అంశాలను ఈ పరీక్షలలో అడుగనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 22,910 రూపాయలు నుండి 96,890 రూపాయలు వరకూ జీతం అందనుంది.
0 Comments