ఆకర్షనీయమైన స్టై ఫండ్స్, ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు, అస్సలు మిస్ కావద్దు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కు చెందిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL),
పంజాబ్ సర్కిల్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ అప్ప్రెంటీస్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యంశాలు :
1). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు.
2). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.
3). ఆకర్షనీయమైన స్టై ఫండ్స్ లభిస్తాయి.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. BSNL Vacancies 2022
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
బీఎస్ఎన్ఎల్ నుండి వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన అతి ముఖ్యమైన అంశాలను గురించి మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : మార్చి 9, 2022.
విభాగాల వారీగా ఖాళీలు :
టెక్నీషియన్ అప్ప్రెంటీస్ (డిప్లొమా హోల్డర్స్ ) - 24
మొత్తం పోస్టులు :
24 అప్ప్రెంటీస్ పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల నుండి సాండ్ విచ్ కోర్సులు /ఎలక్ట్రానిక్స్ /ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ /కంప్యూటర్ /ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ /ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ మొదలైన ఇంజనీరింగ్ /టెక్నాలజీ విభాగాలలో డిప్లొమా కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
వయసు :
25 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను అభ్యర్థులు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు..?
విద్యార్హతల మార్కుల మెరిట్ /షార్ట్ లిస్ట్ /ఆన్లైన్ డాక్యూమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
స్టై ఫండ్ :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 8000 రూపాయలు వరకూ స్టై ఫండ్ లభించనుంది.
0 Comments