వాక్ ఇన్ ఇంటర్వ్యూల ద్వారా పోస్టుల భర్తీ, పూర్తి వివరాలను ఇప్పుడే చూడండి.ప్రముఖ విద్యా సంస్థ శశి ఫౌండేషన్,
వెలివెన్ను మరియు ఇతర బ్రాంచులలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ విధానాలను అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక జరుగనుంది.
ఈ పోస్టులకి ఎంపికైన అభ్యర్థులకు శశి ఫౌండేషన్ కు సంబంధించిన వెలివెన్ను, కానూరు, నిడదవోలు, రాజమహేంద్రవరం, మండపేట, నల్లజెర్ల మరియు చింతలపూడి క్యాంపస్ లలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
శశి ఫౌండేషన్ నుండి తాజాగా విడుదల అయిన ఈ ప్రకటన గురించి మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.
ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలు : మార్చి 5, 6, 12 మరియు 13.
ఇంటర్వ్యూ మరియు డెమో ల నిర్వహణ సమయం : 9 AM to 1 PM
ఇంటర్వ్యూ నిర్వహణ వేదిక :
శశి వెలివెన్ను క్యాంపస్, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.
పోస్టులు - వివరాలు :
సీనియర్ లెక్చరర్స్ ( జేఈఈ అడ్వాన్స్ మెయిన్ & నీట్ )
జూనియర్ లెక్చరర్స్ ( ఐపీఈ, జేఈఈ మెయిన్స్ & ఈఏపీసెట్ )
సీబీఎస్ఈ స్కూల్ ఫౌండేషన్ టీచర్స్ ( 6 - 10 తరగతులు )
హై స్కూల్ టీచర్స్ ( 6-10 తరగతులు )
ప్రైమరీ స్కూల్ టీచర్స్ ( 5వ తరగతి లోపు )
డిగ్రీ లెక్చరర్స్
సబ్జెక్టులు :
మాథ్ మెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జూవలజీ, సంస్కృతం, ఇంగ్లీష్, తదితర అన్ని సబ్జెక్టులను బోధించడానికి గానూ, ఖాళీగా ఉన్న టీచర్స్ పోస్టులను ఈ ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయనున్నారు. Sasi Jobs Recruitment 2022
అర్హతలు :
డీఈడీ/ సంబంధిత సబ్జెక్టు విభాగాలలో బీఈడీ/పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టుల భర్తీకి నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
45 సంవత్సరాలు వయసు లోపు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టుల భర్తీకి నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చును.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను అభ్యర్థులు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు..?
వాక్ ఇన్ ఇంటర్వ్యూ మరియు డెమో ల విధానముల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
ఇంటర్వ్యూలకు హాజరు కాబోయే అభ్యర్థులు తమ వెంట సర్టిఫికెట్స్ ఫోటో కాపీస్, రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలను తమ వెంట తీసుకుని రావలెను అని ఈ ప్రకటనలో తెలిపారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 15,000 - 2,00,000 లక్షల రూపాయలు వరకూ జీతం లభించనుంది.
సంప్రదించవల్సిన ఫోన్ నంబర్లు :
08819-350123
08819-350007
96404 40007
0 Comments